మహేష్ అభిమానులకు శుభవార్త.. ఉగాది రోజే ఆరంభం!

సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ మంచి జోష్‌లో ఉన్న మహేష్.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ రికార్డులు తిరగరాశారు. ఈ సినిమాతో 2020 సంవత్సరానికి కిక్ స్టార్ట్ ఇచ్చిన ఆయన.. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సన్నద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ అందుకున్న మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ కావడంతో.. దీని తర్వాత చేయాలనుకున్న సినిమాను ముందుకు తీసుకొచ్చారు. డైరెక్టర్ పరశురామ్ తో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు మహేష్ బాబు.

Mahesh Babu- Parasuram movie: Interesting Update

మరోవైపు గీత గోవిందం సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పరశురామ్.. మహేష్‌తో సినిమా చేసేందుకు అన్నివిధాలా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కథపైనే పరశురామ్ కసరత్తు చేస్తున్నాడు. మరో వైపున ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఆ రోజునే ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల వివరాలు కూడా ప్రకటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. సో.. మొన్న సంక్రాంతికి సంబరాలు తెచ్చిన మహేష్.. రేపు ఉగాదికి ఉత్సాహం నింపబోతున్నారన్నమాట. మహేష్ అభిమానులకు ఇక పండగే పండగ!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X