Mahesh Babu ఫ్యాన్స్‌కు పండుగ లాంటి న్యూస్.. రాజమౌళి మూవీకి ముందే మరో సినిమా!

ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా రకరకాల సమస్యల మధ్య షూటింగ్ కొనసాగిస్తున్నది. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో వస్తుందా? అనే టెన్షన్ అభిమానులను పట్టి పీడిస్తున్నది. గుంటూరు కారం సినిమా షూటింగ్ ప్రొగ్రెస్ చూస్తే అలాంటీ ఫీలింగ్ కలగమానదు.

గుంటూరు కారం సినిమాకు ఆ తర్వాత రాబోయే రాజమౌళి సినిమాకు మధ్య భారీ గ్యాప్ ఉండబోతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఈ రెండు సినిమాల మధ్య మహేష్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారనే విషయం సినీ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. మహేష్ బాబు కొత్త సినిమా వివరాల్లోకి వెళితే..

 Mahesh Babu planning a movie between Guntur Karam and SS Rajamouli movie

గుంటూరు కారం సినిమా షూట్ మొదలైనప్పటి నుంచి రకరకాలుగా వాయిదాలు పడుతూ వస్తున్నది. అయితే యూనిట్ మాత్రం సంక్రాంతి బరిలో కచ్చితంగా ఉంటామని సంకేతాలు ఇస్తున్నారు. అయితే షూటింగ్ మాత్రం నత్త నడకన సాగుతున్నది. ఏది ఏమైనా మహేష్ బాబు సినిమా సంక్రాంతికి వచ్చినా.. రాజమౌళి సినిమా రావడానికి కనీసం ఏడాదిన్నర రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు మధ్య మరో కొత్త సినిమాను మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Mahesh babu Guntur Kaaram Still

మహేష్ బాబుకు ఇటీవల ఓ దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమాకు ప్లాన్ జరుగుతున్నది. త్రివిక్రమ్, రాజమౌళి మధ్య వచ్చే గ్యాప్‌ను ఫిల్ చేయడానికి మహేష్ ఈ నిర్ణయం తీసుకొన్నాడనే ప్రచారం ఫిలింనగర్‌లో జరుగుతున్నది. అయితే ఈ విషయంపై మహేష్ బాబు టీమ్ ఎలాంటి క్లారిటీ ఇచ్చేందుకు సిద్దంగా లేదని తెలుస్తున్నది. ఈ సినిమా షూట్ గుంటూరు కారంతోపాటు ఒకే కాలంలో చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

SS Rajamouli movie

ఇదిలా ఉండగా, గుంటూరు కారం సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి లొకేషన్స్ వేట కూడా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ సినిమా సమ్మర్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దాంతో గుంటూరు కారం, రాజమౌళి సినిమా మధ్య ఇంకో సినిమా వస్తుందనే వార్తలు అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X