సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌కి వెళతాడా!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా రాణించగల సత్తా ఉన్న హీరో. హాలీవుడ్, బాలీవుడ్ హీరోలకు తగ్గకుండా మహేష్ లుక్స్ ఉంటాయి. మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇదివరకే అనేక విధాలుగా చర్చ జరిగింది. కానీ మహేష్ మాత్రం తెలుగు సినిమాకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.
గతంలో బాలీవుడ్ అవకాశాలు వచ్చినా మహేష్ సున్నితంగా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. తాజగా సమాచారం ప్రకారం మహెష్ బాబు బాలీవుడ్ లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో తనకు పరిచయం ఉన్న ప్రముఖులతో మహేష్ ఇటీవల కలసి అనేక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది.

మహేష్ ఒకే అనాలే కానీ అతడితో బాలీవుడ్ చిత్రం చేసేందుకు దర్శకులు సిద్ధంగా ఉంటారు. మహేష్ ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడు. బాలీవుడ్ సినిమా చేయడం వలన మహేష్ మార్కెట్ పెరుగుతుందని సినీవర్గాలు, అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











