»   » మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్కూలు పెడుతున్నారా?

మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్కూలు పెడుతున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య ప్రచారంలోకి వచ్చింది. త్వరలో ఆయన ఓ ఇంటర్నేషనల్ స్కూలు స్థాపించబోతున్నారట. నాణ్యమైన విద్యను అందించి భవిష్యత్తులో విద్యాదాతగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంలో ఆయన ఉన్నట్లు సమాచారం.

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ త్వరలో ఆయన స్థాపించబోతున్నారని, ఇందులో ప్రతిభగల పేద విద్యార్థులకు కూడా విద్యను అందించడం లాంటివి చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Mahesh Babu Planning to start International School?

ఈ స్కూలును ఏపీ కొత్త రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు ఒక్కడే కాదని, తన మిత్రులతో కలసి ఈ స్కూల్ ను ప్రారంభించాలని ఆయన భావిస్తున్నాడని టాక్.

ఈ ఇంటర్నేషనల్ స్కూలు ప్రాజెక్టులో మహేష్ బాబు స్లీపింగ్ పార్టనర్ ఉంటారని, ఈ ప్రాజెక్టులో కొంత పెట్టుబడి పెట్టడంతో పాటు పబ్లిసిటీ, ప్రచార కార్యక్రమాలు తానే చూసుకుంటాడని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి విద్యను అందించడం కూడా సేవే కాబట్టి మహేష్ బాబు ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Mahesh babu fun at sets with spyder team
English summary
Buzz is that actor Mahesh Babu is keen to invest in education. Sources tell us that the actor has evinced interest in setting up a never seen before international school in the new capital of Andhra Pradesh, Amaravati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu