గౌతమ్ కోసం మహేష్ మెగా స్కెచ్...!?

By Sindhu

మహేష్ బాబు అభిమానులకి శుభవార్త. మహేష్ తనయుడు గౌతమ్ ని వెండితెరపై 'హీరోగా" చూడ్డానికి ఎన్నో సంవత్సరాలు వేచి చూడాలని ఫీలౌతున్నారా? ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ని బట్టి గౌతమ్ కోసం అంతకాలం ఆగక్కర్లేదని తెలుస్తోంది. గౌతమ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసి అతనికి చిన్నతనంలోనే కెమెరా ఫియర్ పోగొట్టాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. తనలానే గౌతమ్ తోను చిన్న వయసులోనే హీరో వేషాలేయించి, తద్వారా అతడిని ఇప్పట్నుంచే అభిమానులకి దగ్గర చేయాలని చూస్తున్నాడు.

మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గానే పలు చిత్రాల్లో లీడ్ క్యారెక్టర్లు చేసి ఫైట్లు, డాన్సులు ఇరగడీసిన సంగతి తెలిసిందే. తనయుడికి కూడా అలాంటి లైవ్ ఎక్స్ ఫీరియన్స్ తో ఫ్యూచర్ లో పెద్ద హీరోగా ఎదిగేలా చేయడానికి మహేష్ కృషి చేస్తున్నాడట. ఇందు కోసం ఇప్పటికే మహేష్ తన సన్నిహితులైన కొందరు దర్శకులకి విషయం చెప్పి గౌతమ్ కోసం కథలు తయారు చేయమని చెప్పాడట. అంతా అనుకున్నట్టు జరిగితే, వచ్చే ఏడాది ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడవచ్చునట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X