ఫ్యామిలీతో పాటు మహేష్ బాబు జంప్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల పాటు కుటుంబ సమేతంగా హాలిడే ట్రిప్ కు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 20 తర్వాత సింగర్ పూర్‌కు జంప్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్ సినిమా త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఎడతెరిపి లేకుండా వరస షూటింగులతో బాగా వర్కౌట్ చేసిన మహేష్ బాగా అలసి పోయాడు. దీంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మరో వైపు మహేష్ లాంటి సెలబ్రిటీ హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలను తనివితీరా ఎంజయ్ చేయడం కూడా కష్టమే. ఇది కూడా మహేష్ బాబు హాలీడే టూర్ కు ఓ కారణంగా తెలుస్తోంది. ట్రిప్ ముగించుకుని జనవరి 10లోపు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ మరునాడే మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మ్యాన్' సినిమా విడుదల ఉంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న బిజినెస్ మ్యాన్ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో ఉంటుంది. ఇందులో మహేష్ బాబు సరసన కాజల్ రొమాన్స్ చేస్తోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











