పోలీస్ ఇన్ఫార్మర్ గా ఇరగతీయనున్న మహేష్ బాబు
మహేష్ బాబు తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ కాకుండా పోలీస్ ఇన్ఫార్మర్ గా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆల్రెడి ఇప్పటికే మహేష్ ..పోకిరీ ఇలా ఇన్ఫార్మర్ గా చేసి ఉన్నాడు. అయితే ఇందులో ఓపెన్ స్క్రీన్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. మొదటే అతను పోలీస్ ఇన్ఫార్మర్ అని ఓపెన్ చేసి కథ నడపనున్నారని చెప్తున్నారు. ఇక మార్చి 26 నుంచి ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరగనుంది. రాజు సుందరం డాన్స్ డైరక్షన్ లో అక్కడ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది.వరసగా హిట్స్ తో దూసుకు పోతున్న తమన్ సంగీతం అందిస్తున్నాడు. 16 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











