twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ఖలేజాకి వీరతిలకం దిద్దిన 'రక్త ఖలేజా'

    By Sindhu
    |

    సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం అల్లూరి సీతారామరాజు గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ చిత్రంలో కృష్ణ పలికిన పవర్ ఫుల్ డైలాగ్స్ అందరి నోట నానుతూనే వుంటాయి. ఇక కృష్ణ తనయుడు మహేష్ బాబు ఖలేజాతో అల్లూరి సీతారామరాజు గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రోజు విడుదలవుతున్న ఖలేజా సినిమాలో మహేష్ పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు అని తెలిసింది. అందుకు అభిమానులు ఒక్కొక్కొరు ఒక్కోవిధంగా తమ అభిమానాన్ని చాటుకొటుంన్నారు.

    'పిచ్చి పిడికేడైతే - వెర్రి వేపచేట్టంత...అలాఉంది ఈ వ్యవహారం' గడిచిన మూడు సంవత్సరాలుగా మహేష్ బాబు చిత్రం కోసం వేచి...విసిగి వేసారి పోయిన ఒక వీరాభిమాని తాజాగా రాబోతున్న మహేష్ ఖలేజా చిత్రం పై తన అభిమానాన్ని చూపాడు. మహేష్ ఖలేజా గా వస్తున్న మహేష్ బాబు చిత్రానికి తన రక్తంతో వీరతిలకం దిద్దాడు.

    మీరే చూడండి అతగాడు ఏరకంగా ఖలేజా పేరును తన చేతిపై చేక్కుకున్నాడో.... అయితే ఇలా చెయ్యటం ఎంతవరకు సమంజసం? హీరో పై ఉన్న అభిమానం చూపాలంటే ఇదా పద్దతి? ఇలా చెయ్యటం వల్ల ఎవరికీ లాభం ఎవరికి నష్టమో అభిమానులు ఇప్పటికైనా గ్రహించాలి. ఎవరి హీరో పై వారికీ మితిమీరిన అభిమానం ఉంటే పదిసార్లు ఆ హీరో సినిమా చూడండి....లేదా ఎప్పటిలాగా హీరో చిత్ర పటానికి దండలు వేసి కొబ్బరికాయ కొట్టి...హారతి ఇవ్వండి అంతే కాని ఇలా చేతుల మిద ...గుండెల మీద రక్త తిలకాలు ఎందుకు చెప్పండి...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X