twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెర వెనుక మహేష్ తో పాలిటిక్సా...!?

    By Sindhu
    |

    రాజకీయాలకి తాను చాలా దూరమని అంటుంటాడు మహేష్ బాబు. తనకి రాజకీయాలు తెలియవని, ఎప్పటికీ తాను సినీ నటుడిగానే ఉండడానికి ఇష్టపడతానని మహేష్ బాబు చెప్పాడు. అయితే మహేష్ ఎవరికీ బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా అతని తండ్రి ఏ పార్టీకి మద్దతిస్తే అదే మహేష్ పార్టీ అనే ఫీలింగ్ అభిమానుల్లో. గత ఎన్నికల్లో కృష్ణ కుటుంబం తరపున ఎవరూ పోటీ చేయకపోయినా తన మద్దతు మాత్రం కాంగ్రెస్ కేనని కృష్ణ స్వయంగా ప్రకటించాడు. చిరంజీవి పార్టీ పెట్టడతో ఆ ఎన్నికల్లో కృష్ణ కూడా ప్రత్యేకత సంతరించుకుంది.

    అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్ కి విధేయుడిగా ఉన్న కృష్ణ ఇప్పుడు జెండా మార్చాడు..రెండు ముక్కలుగా రాష్ట్ర కాంగ్రెస్ లో సూపర్ స్టార్ కృష్ణ జగన్ పార్టీని తన పార్టీగా ఎంచుకున్నాడు. మహేష్ బాబు మద్దతు కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న జగన్ అతడిని డైరెక్టుగా రాజకీయాల్లోకి దించలేకపోయినా, అతని తండ్రిని తనవైపుకి లాక్కోగలిగాడ. దీంతో ఇప్పుడు అనధికారికంగా మహేష్ బాబు జగన్ మనిఫైపోయాడు. మద్దతిచ్చేది కృష్ణే అయినా యువత ఫాలోయింగ్ బలంగా ఉన్న మహేష్ కోసమే తెరవెనుక ఈ తంతు మొత్తం నడిచిందని అర్థం చేసుకోవచ్చు. అయితే మహేష్ మాత్రం తనకేం తెలీదన్నట్టు తన పాటికి తను సంవత్సరాలకు..సంవత్సారాలు ఒక్కొక్క సినిమాతీసుకొంటున్నాడు...

    English summary
    The State politics will have solid film glamour in the next general elections. Film stars are showing lot of interest in politics. The stars who shined in film industry want to show their strength in politics too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X