సమంత చెప్పులకు మహేష్ బాబు ప్రమోషన్
హైదరాబాద్ : సమంత ఈ మద్యన పేరాగన్ చెప్పులకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చెప్పులను ప్రమోట్ చెయ్యటానికి మహేష్ బాబు సైన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు యాడ్ షూటింగ్ ఈ నెల 18,19 తేదీలలో జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు...నవరత్నా ఆయిల్, రాయిల్ స్టాగ్, అమృతాంజన్, యూనివర్శ సెల్, ఐడియా సెల్యులార్, జాయ్ ఆలూకస్, టీవీయస్, వివల్, మహేంద్ర టాక్టర్స్, సంతూర్ సోప్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వంటివాటికి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు.
మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లారు మహేష్. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ముంబై తర్వాత కేరళ షెడ్యూలు వెళ్లనున్నారు. ముంబై షెడ్యూలు 15 రోజులు పాటు జరగనుంది. కేరళలలో కొన్ని కీలకమైన లవ్ సీన్స్ తీయనున్నారని సమాచారం. అక్కడ అందమైన లొకేషన్స్ లో ఈ సీన్స్ ప్లాన్ చేసారని సమాచారం.

కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలందిస్తున్నారు.
'ఆగడు' టీజర్ లో మహేష్ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్ మొత్తం హుషారుగా సాగిపోయింది.
పంచ్ డైలాగు లేకపోతే.. టీజర్, ట్రైలర్ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











