1000 కోట్ల బడ్జెట్ మూవీకి టైటిల్ ఫిక్స్.. రాజమౌళి గ్రాండ్ సర్ప్రైజ్ అదేనా?

Mahesh Babu-SS Rajamouli: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ మూవీ SSMB29. 'బాహుబలి','ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ల తర్వాత రాజమౌళి చేస్తున్న తదుపరి సినిమా కావడంతో దేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. తాజా ఈ మూవీకి సంబంధించిన ఓ గాసిప్ నెట్టింట్లో తెగవైరలవుతోంది. ఇంతకీ ఆ మ్యారేంటీ?

మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, అడ్వెంచర్ యాక్షన్ సీక్వెన్స్‌, సాంకేతికత పరంగా ఇది ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలు సెట్ చేయబోతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కెన్యా, టాంజానియా, ఒరిస్సా, నైరోబీ వంటి ప్రదేశాల్లో నాలుగు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ప్రతి షెడ్యూల్‌లోనూ మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించారని సమాచారం.

Mahesh Babu Rajamouli Film Title Update Vaaranaasi Buzz Ahead of Nov 15 Reveal

ఇటీవల మహేష్ బాబు లుక్ ఫోటోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఆ లుక్‌లో నంది, త్రిశూలం, ఢమరుకం సింబల్స్ ఉన్న లాకెట్ ధరించిన మహేష్ లుక్ చూసిన అభిమానులు, సినిమాలో డివోషనల్ టచ్ ఉండబోతుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ మూవీకి సంబంధించిన మరో పెద్ద అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రానికి "వారణాసి (Vaaranaasi)" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని, అదే నవంబర్ 15న ప్రకటించబోతున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఈ టైటిల్‌పై పాజిటివ్‌గా స్పందిస్తూ రాజమౌళి సినిమాల్లో ఉండే ఆధ్యాత్మికత, విజువల్ గ్రాండర్‌కి ఇది సరిపోతుందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం రాజమౌళి అంతర్జాతీయ లెవెల్ సినిమాకు "వారణాసి" టైటిల్ సరిపోడని అభిప్రాయపడుతున్నారు.

గతంలో రాజమౌళి #GlobeTrotter అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా కాదు, నిజమైన పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో పాటు జపనీస్, కొరియన్, మాండరిన్ భాషల్లోనూ విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వం, మహేష్ బాబు స్టార్ పవర్ కలిసినప్పుడు ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న భారీ ప్రాజెక్ట్‌గా ఇది నిలుస్తుంది. ఈ మూవీ 2026లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇందులో మహేష్ బాబు ఒక గ్లోబల్ ఎక్స్‌ప్లోరర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రపంచంలోని అడవులను దాటుతూ జరిగే మిషన్, సర్వైవల్ ఎలిమెంట్స్‌, మానవ విలువలు, భావోద్వేగాల మేళవింపుగా కథ సాగుతుందని తెలుస్తోంది. సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాశారు. ఆయన కలం నుంచి 'బాహుబలి', 'మగధీర', 'ఆర్ఆర్ఆర్' వంటి మాస్టర్‌పీస్లు పుట్టిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ కథ కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వనుందనడంలో సందేహం లేదు.

ఇక సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. అయితే ఆమె హీరోయిన్ పాత్రలో కాకుండా, కథలో మలుపు తిప్పే రోల్‌లో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని యూరోపియన్ టెక్నికల్ టీమ్ నిర్వహిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.

తాజా అప్డేట్ ప్రకారం.. జక్కన్న టీమ్ హైదరాబాదులో నవంబర్ 15న భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. అదే రోజున టైటిల్ రివీల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల అవుతుందని టాక్. రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం. మొత్తం మీద మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ ఇండియన్ సినిమాను మరో గ్లోబల్ లెవెల్ రికార్డును తీసుకోబోతోంది. "వారణాసి" అనే టైటిల్ గానీ, మరో పేరుగానీ చివరికి ఏది ఫైనల్ అయినా ఈ సినిమా మాత్రం భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Read more about: mahesh babu ssmb29 ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X