మహేష్ బాబు- రాజమౌళి మూవీ: బాబోయ్ అన్ని రోజులా?
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతున్నసంగతి తెలిసిందే. దీనికి చాలా సమయం పట్టనుంది.
Recommended Video

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఈ ఇద్దరు స్టార్లు ఖరారు చేశారు. అయితే వీరి కాంబో మూవీ ఎప్పుడు వస్తుంది? అనే దానికి మాత్రం అసలు సమాధానం లేదు. మహేష్ బాబు, రాజమౌళి కమిట్మెంట్స్ ప్రకారం చూస్తే మరో రెండేళ్ల తర్వాతగానీ వీరి సినిమా వచ్చే అవకాశం కనిపించడం లేదు.
అంచేత ఈ సినిమా విషయంలో ఇప్పటి నుండే అభిమానులు అనవసరమైన ఆశలు, ఊహలు పెట్టుకోక పోవడమే మంచిది అనే వాదన వినిపిస్తోంది.

2018లో అసాధ్యం
ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు 25వ మూవీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2018లో మొదటి త్రైమాసికంలో ప్రారంభం కాబోతోంది. 2018 సంవత్సరాంతంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

2019లో త్రివిక్రమ్‌తో మూవీ
వంశీపైడిపల్లి సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఈ సినిమా 2018 చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 2019లో ఈ సినిమా విడుదల కానుంది.

బోయపాటికి ఓకే చెప్పిన మహేష్ బాబు
త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేష్ బాబు తన 27వ సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటితో చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా 2019లోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

మహేష్-రాజమౌళి మూవీ 2020లోనే..?
ఇప్పటి వరకు కమిటైన ప్రాజెక్టులు అనుకున్న ప్రకారం పూర్తయితే 2019లో చివర్లో మహేష్ బాబు-రాజమౌళి మూవీ సెట్స్ మీదకు వెళ్ల నుంది. ఈ చిత్రం 2020లోనే విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

రాజమౌళి నెక్ట్స్ మూవీ సోషల్ డ్రామా
మహేష్ బాబుతో సినిమా మొదలు పెట్టడానికి ముందు రాజమౌళి ఓ సోషల్ డ్రామా మూవీ చేయనున్నారు. ఇది పూర్తయిన తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై రాజమౌళి పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.


Click it and Unblock the Notifications











