Varanasi: బాహుబలి, RRRని మించిన వారణాసి.. 25 నిమిషాల సీక్వెన్స్‌కు ఎన్ని కోట్లంటే?

సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న సినిమా 'వారణాసి' (Varanasi). ఈ పాన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్నది ప్రేక్షకుల ఊహకు అందడం లేదు. తన సినిమాల కథలను ముందుగానే చెప్పే డైరెక్టర్ రాజమౌళి.. ఈసారి భిన్నంగా టైటిల్‌ గ్లింప్స్‌తో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా అమాంతం భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ప్రాజెక్టులలో వారణాసి ఒకటిగా చర్చనీయాంశమైంది. అయితే ఈ సినిమా బడ్జెట్‌ గురించి వినిపిస్తున్న తాజా సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా వారణాసి ప్రాజెక్ట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వినిపిస్తున్న బడ్జెట్ టాక్ సినీ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలంటే స్టార్ రెమ్యునరేషన్స్ లేదా విదేశీ లొకేషన్ల ఖర్చులే గుర్తుకు వస్తాయి. కానీ వారణాసి విషయంలో అసలు పెద్ద భాగం వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్‌కే వెచ్చిస్తున్నారట. త్రేతాయుగాన్ని నేటి ప్రేక్షకుల ముందు నమ్మదగిన రీతిలో చూపించాలంటే సెట్లు, ఆర్ట్ డిజైన్, VFX, యాక్షన్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అన్నీ అంతర్జాతీయ ప్రమాణాల్లో ఉన్నాయంట. అయోధ్య, అరణ్యాలు, యుద్ధరంగాలు తెరపై కృత్రిమంగా కనిపిస్తే ప్రేక్షక అనుభూతి దెబ్బతింటుందనీ, రాజమౌళి ప్రతి ఫ్రేమ్‌ను గ్లోబల్ లెవల్‌లో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని సమాచారం.

Mahesh Babu-Rajamouli s Varanasi Rs300 Crore Treta Yug Episode Shocks Industry

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ త్రేతాయుగ ఎపిసోడ్‌లో VFX ఖర్చే లయన్ షేర్. ఒక హై క్వాలిటీ షాట్‌కే లక్షలు లేదా కోట్లు ఖర్చవుతుండగా, దాదాపు 25 నిమిషాల నిడివి ఉంటుందనీ. ఇందుకోసం ఏకంగా రూ. 250 కోట్లు నుంచి రూ. 300 కోట్ల వరకు వేచిస్తున్నట్టు టాక్. భారీ యుద్ధ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, క్రౌడ్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నేషనల్ VFX స్టూడియోలు వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ కలిపి ఈ భాగాన్ని నిజంగా 'విజువల్ వండర్'గా మలచాలన్నదే రాజమౌళి ప్లాన్ అని తెలుస్తోంది.

VFXతో పాటు యాక్షన్ బ్లాక్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్లు, వైర్ వర్క్, ఇంటర్నేషనల్ స్టంట్ టీమ్స్, లైవ్ ఆర్కెస్ట్రా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బడ్జెట్‌ను భారీగా పెంచుతున్న అంశాలుగా చెబుతున్నారు. పురాణ నేపథ్యం కావడంతో జ్యువెలరీ, ఆయుధాలు, కాస్ట్యూమ్స్ నుంచి నటుల బాడీ లాంగ్వేజ్ వరకూ ప్రతి రీసెర్చ్ జరుగుతోందట.ఈ డీటైలింగ్ వల్ల ప్రొడక్షన్ డిజైన్ ఖర్చు కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు సమాచారం.

రాజమౌళి గత విజువల్ స్పెక్టకిల్స్ అయిన బాహుబలి, RRR లను మించేలా ఈ త్రేతాయుగ ఎపిసోడ్‌ను రూపొందించాలన్నదే లక్ష్యమని టాక్. అయితే ఇది కేవలం విజువల్స్ కోసమే చేసే ఖర్చు కాదని, కథలోని భావోద్వేగ లోతును ప్రేక్షకులకు నేరుగా చేర్చే ప్రయత్నమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు కే.ఎల్. నారాయణ చేపట్టారు. షూటింగ్ వేగంగా సాగుతుండగా, విదేశీ షెడ్యూళ్లు, అంతర్జాతీయ ప్రమోషన్లు కూడా ముందుగానే మొదలైనట్టు సమాచారం. ఇలా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న వారణాసి, భారతీయ సినిమా టెక్నికల్ లిమిట్స్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్తుందా అన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu Varanasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X