For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Spirit మూవీని రిజెక్ట్ చేసిన ముగ్గురు టాలీవుడ్ స్టార్స్.. ప్రభాస్ దీన్ని ఒప్పుకోడానికి కారణం ఇదేనట!

  |

  కృష్ణంరాజు నట వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన అతడు.. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత నుంచి పంథాను మార్చుకుని పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాదు, ఏక కాలంలో వరుసగా అన్నీ భారీ సినిమాలు చేస్తూ హవాను చూపిస్తున్నాడు. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ప్రభాస్.. తన 25వ సినిమా 'స్పిరిట్'ను కూడా ఇటీవలే ప్రకటించాడు. ఈ చిత్రాన్ని గతంలో ముగ్గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులు మీకోసం!

  ‘రాధే శ్యామ్' అంటూ వస్తున్నాడు

  ‘రాధే శ్యామ్' అంటూ వస్తున్నాడు

  ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రమే ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ మూవీలో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

   వరుసగా లైన్‌లో.. ప్రస్తుతం వీటితోనే

  వరుసగా లైన్‌లో.. ప్రస్తుతం వీటితోనే

  ‘రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాను ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్' అనే మూవీ ప్రకటించాడు. కానీ, దాని కంటే ముందే ఈ రెండు చిత్రాలను మొదలెట్టాడు.

  హైలెవెల్ కాన్సెప్టు.. పాన్ వరల్డ్ రేంజ్

  హైలెవెల్ కాన్సెప్టు.. పాన్ వరల్డ్ రేంజ్


  ప్రభాస్.. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేసే మూవీ పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందనుంది. ఇందులో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, సినిమా టైం మెషీన్‌ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన ‘ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. ఇది వచ్చే ఏడాది స్టార్ట్ కానుందని టాక్.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  మళ్లీ బాలీవుడ్ డైరెక్టర్‌తోనే సినిమా

  మళ్లీ బాలీవుడ్ డైరెక్టర్‌తోనే సినిమా

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను మొదలు పెట్టిన ఈ స్టార్ హీరో.. తన 24వ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీన్ని బాలీవుడ్ డైరెక్టర్ ‘వార్' ఫేం సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని తెలిసింది.

  ప్రభాస్ 25వ సినిమా.. సందీప్ వంగా

  ప్రభాస్ 25వ సినిమా.. సందీప్ వంగా

  ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్‌తో కనిపిస్తోన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సినిమా మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 25వ సినిమాను ఇటీవలే ప్రకటించాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు ‘స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

  ప్రభాస్ కంటే ముందే ఆ హీరోలతో

  ప్రభాస్ కంటే ముందే ఆ హీరోలతో

  వాస్తవానికి సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్' స్క్రిప్టును ప్రభాస్ కంటే ముందే ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలకు చెప్పినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అతడు అందరి కంటే ముందే ఈ స్క్రిప్టును సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వినిపించాడట. ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్‌కు కూడా చెప్పాడట. కానీ, వీళ్లంతా దాన్ని రిజెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

  Prabhas Supremacy.. ఈ ఆధిపత్యం అనితర సాధ్యం | Prabhas 25 | Spirit || Filmibeat Telugu
  ప్రభాస్ ఒప్పుకోడానికి కారణం ఇదే

  ప్రభాస్ ఒప్పుకోడానికి కారణం ఇదే

  ‘స్పిరిట్' స్క్రిప్టును పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒప్పుకోడానికి కారణం ఇదేనంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఇందులో హీరో పవర్‌ఫుల్ కాప్ క్యారెక్టర్‌ను చేస్తున్నాడట. ఇప్పటి వరకూ ప్రభాస్ అలాంటి పాత్రను చేయలేదు. దీంతో ఆ లోటును భర్తీ చేయొచ్చని భావించాడట. అందుకే ఈ కథ చెప్పిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది.

  English summary
  Prabhas Doing Several Movies At a Time. Now He Announced 25 Movie Spirit Under Sandeep Reddy Vanga Direction. Before Mahesh Babu, Ram Charan and Allu Arjun Rejected This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X