మహేష్ బాబు, హృతిక్ రోషన్ కాంబినేషన్ 3D రామాయణం.. సెట్టయితే బాక్సాఫీస్ బ్లాస్ట్ అయినట్లే!

ఇండియన్ సినిమా మేకింగ్ ఎంతగా మారుతుందో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలను చూస్తుంటే అర్ధమవుతోంది. బిగ్ స్క్రీన్ పైపౌరాణిక సినిమాలను చూసి చాలా కాలం అవుతోంది. ఇక మళ్ళీ ఆ దశ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులోను నేటితరం టెక్నాలజీని ఉపయోగించి త్రీడి ఫార్మాట్ లో కూడా రూపొందిస్తున్నారు. రామాయణం కథపై వరుసగా సినిమాలు రూపొందుతున్నాయి. ప్రభాస్ తో పాటు మహేష్ బాబు కూడా రాముడిగా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

కంటెంట్ బావుంటే..

కంటెంట్ బావుంటే..

పౌరాణిక అంశాల ద్వారా ఎన్ని సినిమాలనైనా తీయవచ్చని బ్లాక్ అండ్ వైట్ డేస్ లోనే మన సీనియర్ దర్శక నిర్మాతలు నిరూపించారు. ఇక ఎన్నో ఏళ్లకు గాని పౌరాణిక సినిమాలు రావడం లేదు. అందులోనూ చిన్న చిన్న సినిమాలే వస్తున్నాయి. కానీ భవిష్యత్తు లో అగ్ర హీరోలు రామాయణం లాంటి కథలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు క్లారిటీగా అర్ధమవుతొంది. కంటెంట్ బావుంటే కొత్తగా చేయడానికి మన స్టార్స్ ఏ మాత్రం వెనుకడుగు వేయరని చెప్పవచ్చు.

మహేష్ రాముడి పాత్రలో

మహేష్ రాముడి పాత్రలో

అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ మహేష్ బాబు కూడా రాముడిగా కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. చర్చలు కూడా జరిగాయని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ రామాయణం బ్యాక్ డ్రాప్ ఆదిపురుష్ సినిమాను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇక మహేష్ కూడా రాముడిగా కనిపించవచ్చని సమాచారం.

రావణుడిగా హృతిక్ రోషన్

రావణుడిగా హృతిక్ రోషన్

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత మధు మంతెన, దర్శకుడు నితీష్ తివారీ రామాయణం కథను 3Dలో రూపొందించాలని గత ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. బౌండ్ స్క్రిప్ట్ తో పాటు సినిమా ప్లానింగ్ మొత్తం రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హృతిక్ రోషన్ కూడా రావణాసురుడి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీత పాత్ర కోసం దీపికా పదుకొనెను ఫైనల్ చేసినట్లు సమాచారం.

మహేష్ బాబును కలిసిన నిర్మాత..

మహేష్ బాబును కలిసిన నిర్మాత..

ఇక రాముడిగా ఎవరు నటిస్తారు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్న సమయంలో రాముడి పాత్ర కోసం నిర్మాత మధు ఇటీవల మహేష్ బాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. స్క్రిప్ట్ గురించి గంటల తరబడి చర్చలు జరిగినట్లు సమాచారం. స్క్రిప్ట్ ప్లానింగ్ పై పాజిటివ్ కామెంట్స్ చేసిన మహేష్ ఇంకా తన నిర్ణయాన్ని మాత్రం పూర్తిగా చెప్పలేదని తెలుస్తోంది. మహేష్ కొంత ఆలోచనలో పడ్డట్లు కథనాలు వస్తున్నాయి. ఇక మహేష్ ఒప్పుకుంటే మాత్రం మరుక్షణమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X