Guntur Kaaramకు రికార్డ్ లెవెల్‌‌లో మహేశ్ బాబు రెమ్యునరేషన్.. అన్ని కోట్లు ఏంటీ భయ్యా!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు.

ఇక టాలీవుడ్ మోస్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరైన మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం, SSMB29 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మహేశ్ బాబు తాజాగా చేస్తున్న సినిమాకు రికార్డులు బద్దలయ్యే రెమ్యునరేషన్ తీసుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Mahesh Babu Record Level Rs 78 Cr Remuneration For Guntur Kaaram

ఎదురుచూపులు: బాల నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సూపర్ స్టార్ అనే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. గతేడాది 'సర్కారు వారి పాట' సినిమాతో మహేశ్ బాబు అలరించగా.. తన తర్వాతి చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu Record Level Rs 78 Cr Remuneration For Guntur Kaaram

అడ్వెంచర్ మూవీ: ఇక మహేశ్ బాబు ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు అడ్వెంచర్ సినిమా SSMB29 ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నాడు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో SSMB28గా వస్తున్న గుంటూరు కారం ఒకటి.

Mahesh Babu Record Level Rs 78 Cr Remuneration For Guntur Kaaram

పూజా స్థానంలో: హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా గుంటూరు కారం. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. మొదట ఇందులో పూజా హెగ్డే ప్రధాన హీరోయిన్ అనుకున్నారు. కానీ, పలు అనివార్య కారణాలతో పూజా హెగ్డె స్థానంలో శ్రీలీల వచ్చింది.. ఈమె ప్లేసులోకి మీనాక్షి చౌదరి చేరింది.

Mahesh Babu Record Level Rs 78 Cr Remuneration For Guntur Kaaram

స్పెషల్ సాంగ్: పలు వివాదాలు, షూటింగ్ బ్రేక్ లతో నెమ్మదిగా సాగుతున్న గుంటూరు కారం సినిమా నుంచి తప్పించిన పూజా హెగ్డేతో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ స్పెషల్ సాంగ్ చేయించనున్నట్లు టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేశ్ బాబు తీసుకునే రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Mahesh Babu Record Level Rs 78 Cr Remuneration For Guntur Kaaram

రికార్డ్ లెవెల్: గుంటూరు కారం సినిమా కోసం మహేశ్ బాబు జీఎస్టీతో కలిపి ఏకంగా రూ. 78 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. దీంట్లో నిజమెంతుందో తెలియదు కానీ, నాన్ ఇండియా సినిమాల్లో ఇంత భారీ మొత్తంలో రికార్డ్ లెవల్లో పారితోషికం తీసుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తొలిసారి అని అంటున్నారు. గుంటూరు కారం సినిమాను దాదాపుగా రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X