1600 కోట్ల బడ్జెట్ సినిమా.. అసలు మహేశ్ బాబు ఎందుకు వదులుకున్నాడో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్స్, కటౌట్, వైబ్ హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తక్కువగా ఉండదు. ఎలాంటి జోనర్ సినిమాకైనా సెట్ అయ్యే నటుడు అని చెప్పడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు. ఇప్పటికే క్లాస్, మాస్, ఫ్యామిలీ, లవ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే హిందూ పురాణాల ఆధారంగా రూపొందించే భారీ చిత్రాల్లోనూ మహేశ్ బాబును ప్రధాన పాత్రల్లోనే దర్శక నిర్మాతలు ఊహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న 1600 కోట్ల బడ్జెట్ సినిమాను మహేశ్ బాబు వదులుకున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా రామయణం..
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రంగా రణబీర్ కపూర్ రామాయణ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్ లో రూ.1600 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి కన్నడ సూపర్ స్టార్ యష్ కో ప్రొడ్యూసర్ గా ఉండటం విశేషం. ప్రస్తుతం ఇండియాలోని హ్యయేస్ట్ బడ్జెట్ చిత్రంగా రామయణ పార్ట్ : 1, పార్ట్ : 2 చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఇక మొదటి పార్ట్ కు రూ.900 కోట్లు బడ్జెట్, రెండవ పార్ట్ కు రూ.600 కోట్ల బడ్జెట్ కేటాయించడం విశేషంగా మారింది.

రామాయణ సినిమా విశేషాలు..
5000 ఏళ్ల నాటి రామయాణ కథను హిందీలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో సరికొత్తగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి 8 సార్లు ఆస్కార్ అవార్డ్ ను అందుకున్న DNEG సంస్థ వీఎఫ్ఎక్స్ అందిస్తుండటం విశేషం. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రలను పోషిస్తున్నారు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీతగా అలరించబోతోంది. మరిన్ని పాత్రల్లో స్టార్ కాస్ట్ నటిస్తుండటం విశేషం. ఇక రామయణ : పార్ట్ ను 2026 దీపావళికి విడుదల చేయబోతున్నారు. 2వ పార్ట్ ను 2027 దీపావళికి విడుదల చేయబోతున్నారు.
రాముడిగా మహేశ్ బాబుకు అవకాశం..
సూపర్ స్టార్ మహేశ్ బాబు మైథాలాజీ సినిమా ఎప్పుడు చేస్తారా? అని అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆయన అభినయం రాముడిగా, కృష్ణుడిగా మెప్పిస్తుందనేది అందరి మాట. ఈ క్రమంలోనే హిందీలో రూపుదిద్దుకుంటున్న రామయణ చిత్రానికి రాముడి పాత్రలో నటించడానికి తొలుత మహేశ్ బాబునే సంప్రదించారంట. కానీ మహేశ్ బాబు తనకు ఉన్న కమిట్ మెంట్స్ కారణంగా వదులుకున్నారని, ముఖ్యంగా SSMB29కి డేట్స్ ఇవ్వడంతోనే వదులుకున్నారని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ తో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం మహేశ్ బాబు చేయాల్సిందని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
శరవేగంగా మహేశ్ బాబు SSMB 29..
ఇక ప్రస్తుతం మహేశ్ బాబు దర్శక ధీరుడు, ఇండియాస్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో భారీ అడ్వెంచర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. SSMB 29 వర్క్ టైటిల్ తో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. 1000 కోట్ల రూపాయలతో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 25న విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











