twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాన్ ఇండియా దర్శకుడిని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. నచ్చలేదని మొహం మీదే చెబుతూ..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ సినిమాల లిస్టు పెద్దగానే ఉంది. అయితే ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాని చర్చల దశలో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులపై మాత్రం త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మన అగ్ర హీరోలు పాన్ ఇండియా దర్శకులను లైన్ లో పెడుతున్నారు. ఇక మహేష్ బాబు మొదటిసారి ఒక పాన్ ఇండియా దర్శకుడిని రిజెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది.

    సర్కారు వారి పాటతో బిజీగా..

    సర్కారు వారి పాటతో బిజీగా..

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాటతో బిజీ కానున్న విషయం తెలిసిందే. గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయ్యింది. ఆ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ బాబు సరికొత్త స్టైల్ తో కనిపిస్తుండడంతో సినిమాకు మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది.

    త్రివిక్రమ్ సినిమా ఎప్పుడంటే..

    త్రివిక్రమ్ సినిమా ఎప్పుడంటే..

    సర్కారు వారి పాట అనంతరం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టీమ్ లో జాయిన్ కానున్న విషయన్ తెలిసిందే. వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలని మహేష్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు. లాక్ డౌన్ లేకపోయి ఉంటే షూటింగ్ పనులు ఈపాటికే మొదలయ్యేవి. ఇక ఆ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ చేయవచ్చని టాక్ వస్తోంది.

    ప్రశాంత్ నీల్ తో చర్చలు

    ప్రశాంత్ నీల్ తో చర్చలు

    ఇక రాజమౌళితో కూడా ఒక పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ ఆ తరువాత కూడా అదే ఫ్లోను కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఇక ఇటీవల ప్రశాంత్ నీల్ కూడా కథ చెప్పినట్లు టాక్ వస్తోంది. KGF హిట్టయిన అనంతరం మహేష్ బాబు ప్రశాంత్ నీల్ కు ఫోన్ చేసి మరి అభినందించారు. కథ ఉంటే చెప్పమని ప్రశాంత్ నీల్ కు మహేష్ ముందే హింట్ ఇచ్చాడు.

    నచ్చలేదని చెప్పేశాడట

    నచ్చలేదని చెప్పేశాడట

    అయితే మహేష్ బాబుకు సెట్టయ్యే ఒక స్టోరీ లైన్ ను ఇటీవల వినిపించినట్లు టాక్ వస్తోంది. అయితే మహేష్ కు అది ఏ మాత్రం నచ్చలేదట. మనం తప్పకుండా వర్క్ చేద్దామని అంటూనే ఆ కథ బాగా లేదని సున్నితంగా తిరస్కరించారట. మరొక డిఫరెంట్ కథ ఏదైనా ఉంటే చెప్పమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

    మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక ప్రశాంత్ నీల్ కథ సెట్ చేయగలిగితే రాజమౌళి సినిమా తరువాతే మహేష్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

    English summary
    Recently the talk is coming that Prashant Neel has also told the story. After the KGF hit, Mahesh Babu called Prashant Neil and congratulated him. Mahesh has already given a hint to Prashant Neel to tell the story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X