»   » మహేష్-త్రివిక్రమ్ మీద మరీ ఇంత చెత్త ఇమాజినేషనా?

మహేష్-త్రివిక్రమ్ మీద మరీ ఇంత చెత్త ఇమాజినేషనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ హిట్టు కొట్టినోడే కింగ్. ఏదైనా సినిమా ప్లాప్ అయితే నానా అర్థాలు తీస్తారు. రకరకాల ప్రచారాలు మొదలు పెడతారు. స్టార్ హీరోల విషయంలోనూ అంతే. బ్రహ్మోత్సవం, అ..ఆ సినిమాల ఫలితాల అనంతరం మహేష్ బాబు, త్రివిక్రమ్ విషయంలో ఇండస్ట్రీలో ఓ చెత్త ఇమాజినేషన్ చక్కర్లు కొడుతోంది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల ముందు పరిస్థితి వేరు. ఆ తర్వాత పరిస్థితి అందరికీ తెలిసిందే. 'అ..ఆ' సినిమా విడుదల ముందు ఊహాగానాలు సాధారణ స్థాయిలో ఉన్నా, సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఫలితాలు అదిరిపోతున్నాయి.

Mahesh Babu rejected Trivikram Srinivas Story?

'అ..ఆ', 'బ్రహ్మోత్సవం' జయాపజాలను బేస్ చేసుకుని కొన్ని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అదేమిటంటే.... 'అ..ఆ' స్టోరీ ముందుగా మహేష్ బాబు వద్దకు వెళ్లిందని, మహేష్ బాబు దాన్ని తిరస్కరించడంతో ఆ సినిమాను త్రివిక్రమ్ నితిన్ తో చేసాడని ఓ కొత్త రూమర్ ప్రచారంలోకి వచ్చింది.

అయితే ఈ రూమర్‌ను త్రివిక్రమ్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నాయి. 'అ..ఆ' స్టోరీ అసలు మహేష్ బాబు వద్దకు వెళ్లలేదని, ఆయన రేంజికి తగిన స్టోరీ ఇది కాదని స్పష్టం చేస్తున్నారు. నితిన్ తో సినిమా చేస్తానని త్రివిక్రమ్ మాటిచ్చాడు, ఈ క్రమంలోనే సమంతను హీరోయిన్ గా పెట్టి త్రివిక్రమ్ ఈ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ప్లాన్ చేసారు. ఈ స్టోరీ కేవలం నితిన్ వద్దకే వచ్చింది...ఏ ఇతర హీరోల దగ్గరకు వెళ్లలేదని స్పష్టం చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించాయి కదా... అయిన మహేష్ బాబు-త్రివిక్రమ్ విషయంలో ఇలాంటి చెత్త ఇమేజినేషన్లు క్రియేట్ చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండద అని అంటున్నారు.

English summary
Film Nagar source said that...Mahesh Babu rejected Trivikram Srinivas A..Aa Story. But Trivikram's close friends its not true.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu