వైయస్ జగన్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు...!?
తన పనేదో తాను చూసుకుని, ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోని జెంటిల్ మేన్ హీరో మహేష్ బాబు ముందు ముందు కూడా ఇదే తీరున ఉండాలని అనుకుంటున్నాడు. ఏ నటుడికైనా సినీ రంగంలో ఉన్నంతవరకు ఉండే మర్యాద, మనన్న రాజకీయ రంగంలో అడుగుపెడితే ఉండదనేది మహేష్ ఫీలింగ్. అంతే కాదు అందుకు నిదర్శనం చిరంజీవిని చూస్తూనే ఉన్నాం. అందుకే రాజకీయాలు తనకి సరిపడవని, రాజకీయ రంగంలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని చాలా సందర్భాల్లో చెప్పాడు.
కానీ మెగా హీరోలు, నందమూరి కుంటుంబంతో పాటు తెలుగు చిత్ర రంగంలో ఫేస్ వేల్యూ ఉన్న హీరో ఇతనే కావడంతో రాజకీయ వర్గాలు మహేష్ మద్దతు కోసం పాకులాడుతున్నాయి. ముఖ్యంగా గ్లామర్ లేని జగన్ పార్టీకి మహేష్ లాంటి అందగాడి గ్లామర్ చాలా అవసరం అందుకే అతను తరచుగా మహేష్ ని వెంటాడుతూ తన పార్టీకి మద్దతు ఇమ్మని కోరుతున్నాడు. అయితే మిస్టర్ క్లీన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేక మహేష్ అతని ఆఫర్స్ అన్నింటినీ సున్నితంగా తిరస్కరిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











