చిరు-కొరటాల మూవీ.. మహేష్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్.. అంత పెద్ద మొత్తంలోనా!!
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ ప్రాజెక్ట్‌పై రోజుకో రూమర్ బయటకు వస్తోంది. మొదటగా రామ్ చరణ్-చిరంజీవి కలిసి నటిస్తారని టాక్ వచ్చింది.. తాజాగా ఆ ప్లేస్‌లో మహేష్ బాబు వచ్చి చేరాడని తెలుస్తోంది. మహేష్ బాబు పాత్రపై, లుక్‌పై, నిడివిపై రోజుకో రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. తాజాగా మహేష్ బాబు రెమ్యూనరేషన్ విషయమై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటి సంగతేంటో ఓ సారి చూద్దాం.

రూమర్స్‌తో తలనొప్పులు..
మొదటగా కొరటాల చిరు ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన క్షణం నుంచీ ఏదో ఒక రూమర్ బయటకు వస్తూనే ఉంది. టైటిల్, ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఫ్యాన్స్ చేసే రచ్చకు స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ దిగి.. అవన్నీ తప్పుడు వార్తలే.. అధికారికంగా తామే ప్రకటిస్తామని ఫస్ట్ లుక్, టైటిల్‌పై వస్తున్న రూమార్లను కొట్టిపడేసింది.

చిరు-చెర్రీ..
కొరటాల రెడీ చేసిన స్క్రిప్ట్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు చాలా ప్రాముఖ్యత ఉందట. యంగర్ చిరంజీవిగా నటించేందుకు రామ్ చరణ్‌ను తీసుకుందామని భావించారట. ఆ దిశగా అడుగులు కూడా పడ్డాయి. ఈ మేరకు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. చిరు-చెర్రీలు కలిసి నటించబోతోన్నారు ఇక పండగే అంటూ ఊదరగొట్టారు.

చెర్రీ స్థానంలో మహేష్..
అయితే ఆర్ఆర్ఆర్ ఆలస్యం అవుతుండటంతో.. రామ్ చరణ్‌ను వదిలేది లేదని రాజమౌళి కరాఖండిగా చెప్పాడట. అందుకే చేసేదేమీ లేక వేరే ఆప్షన్ వెతికారట. అయితే ఆ పాత్రకు ఇంపార్టెంట్ కావడంతో స్టార్ హీరోనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఆ క్రమంలోనే మహేష్ బాబును సంప్రాదించారట. చిరు-కొరటాల ఇద్దరూ సన్నిహితులే కావడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.

రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..
చిరు కొరటాల ప్రాజెక్ట్‌లో మహేష్ దాదాపు ముప్పై నిమిషాల పాటు కనిపిస్తాడని సమాచారం. అయితే ఈ మేరకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మామూలుగా మహేష్ ఓ సినిమాకు దాదాపు 50కోట్లు పుచ్చుకుంటాడని టాక్. ఈ సినిమాకు 30కోట్లకు పైగానే తీసుకుంటున్నాడని సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియదు గానీ.. ఈ వార్తలు మాత్రం తెగ హల్చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











