త్రివిక్రమ్ సక్సెస్ ఫార్ములా.. ఆ ఇద్దరి మధ్యలో మహేష్ బాబును నలిపేసేందుకు భారీ స్కెచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇవ్వక తప్పడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లు మిస్ అయినట్లే. కానీ వచ్చే ఏడాది మాత్రం మహేష్ వరుసగా రెండు సినిమాలను రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. సర్కారు వారి పాట అనంతరం త్రివిక్రమ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలం తరువాత మహేష్ ఇద్దరి హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

కీర్తి సురేష్ మొదటిసారి
పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్ మొదటిసారి మహేష్ బాబుతో జోడి కట్టింది. దర్శకుడు పరశురామ్ ఎప్పటిలానే హీరో హీరోయిన్ మధ్య ఉండే కామెడీ కెమిస్ట్రీని ఈ సినిమాలో కూడా సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం.

చాలా కష్టమైన పని..
చాలా వరకు మహేష్ బాబు లాంటి టాప్ హ్యాండ్సమ్ హీరోకు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని. ప్రస్తుతం ఇండస్ట్రీలో హోరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. మిగతా టాప్ హీరోయిన్స్ ఇదివరకే మహేష్ తో రొమాన్స్ చేశారు. దీంతో ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులలో హీరోయిన్స్ ఎవరనేది సస్పెన్స్ గా మారింది.

పాత ఫార్మాట్ లోనే
ముఖ్యంగా త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ మళ్ళీ పాత ఫార్మాట్ లోనే ఇద్దరి హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. త్రివిక్రమ్ సినిమాలలో ఎక్కువగా ఇద్దరు హీరోయిన్స్ కూడా హీరోను నలిపేయడం కామన్. ఇక మహేష్ లాంటి హీరో అంటే దాదాపు అదే తరహాలో ఉండవచ్చని టాక్ నడుస్తోంది.

హీరోయిన్స్ ఎవరంటే?
ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేని అనుకున్నట్లు రూమర్స్ అయితే వచ్చాయి కానీ అందులో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా త్రివిక్రమ్ టీమ్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేసి నటీనటుల వివరాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











