కొరటాలకు ఏమైంది?: మహేష్‌కు టెన్షన్.. 'భరత్ అనే నేను'పై ఇది నిజమేనా?
Recommended Video

స్క్రిప్ట్ పక్కాగా ఓకె అనుకున్న తర్వాతే సెట్స్ పైకి వెళ్లే దర్శకులు కొందరైతే.. సెట్స్ లోనే సందర్భానికి తగ్గట్లు సీన్స్ మార్చసేవాళ్లు మరికొందరు. ఈ రెండు కాక.. తీసిన సీన్స్ రీషూట్ చేసే దర్శకులూ ఉన్నారు. కారణం క్లారిటీ లేకపోవడమే.
దర్శకుడు కొరటాల శివ ఇప్పుడిదే సమస్యను ఎదుర్కొంటున్నారట. స్క్రిప్ట్‌లో ఉన్న లోపాలో!.. లేక అనుకున్న విధంగా రాలేదో! తెలియదు కానీ.. మొత్తానికి 'భరత్ అనే నేను'లో కొన్ని సీన్స్ రీషూట్ చేయడానికి సిద్దమైపోయారట. ఫిలిం నగర్ వర్గాల్లో ఇప్పుడిదో హాట్ టాపిక్.

అనుకున్నట్లు రాలేదట!:
మహేష్ బాబు హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. వారసత్వ రాజకీయాలను బేస్ చేసుకుని రాసుకున్న లైన్ ఆధారంగా కొరటాల శివ కథ అల్లుకున్నారనే టాక్ ఉంది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ అనుకున్న విధంగా పిక్చరైజ్ చేయలేకపోయారట కొరటాల.

ఆ సినిమా ఛాయలు?:
కథానుగుణంగా ఇటీవల తెరకెక్కించిన అసెంబ్లీ సన్నివేశాలు కొరటాలకు నచ్చలేదట. రషెస్ చూశాక.. ఆ సీన్స్‌లో 'లీడర్' సినిమా ఛాయలు కనిపించడంతో.. వెంటనే స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో నిమగ్నమయ్యాడట.

స్క్రిప్టులో మార్పులు
కథలో కీలకంగా ఉండే ఈ సీన్స్‌పై వేరే సినిమాల ఛాయలు కనిపించకుండా కొరటాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ రీషూట్ చేసేందుకు సిద్దమైపోయాడట. అయితే ఈసారి స్క్రిప్టులో ఆయన ఎలాంటి మార్పులు చేసి సీన్స్ తెరకెక్కించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

క్లారిటీ మిస్ అయిందా?:
రీషూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నకు.. కొరటాల క్లారిటీ మిస్ అయ్యాడేమో? అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ ముందే పక్కాగా రాసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ సమస్యను కొరటాల ఎలా గట్టెక్కుతాడో చూడాలి.

మహేష్‌కు టెన్షన్:
బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాప్స్ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో.. మహేష్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ కొరటాల శివ రీషూట్ వ్యవహారం ఆయన్ను కూడా టెన్షన్ పెట్టేదిగా మారిందంటున్నారు.

నిర్మాతలకు భారమే:
కొరటాల శివ రీషూట్స్ వ్యవహారం నిర్మాతలకు పెద్ద ఇబ్బందిగా మారింది. రీషూట్స్ కారణంగా నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ షూటింగ్ సాగుతున్న తీరు రిలీజ్ డేట్‌పై అనుమానాలను పెంచుతోంది.

భారీ అంచనాలు:
సినిమా విషయానికొస్తే.. మహేష్-కైరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మహేష్ సీఎంగా నటిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమాల తర్వాత కొరటాల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. 'భరత్ అనే నేను'పై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











