హాట్ టాపిక్ :బాలీవుడ్ చిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్
హైదరాబాద్ : మహేష్ బాబు..బాలీవుడ్ చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తున్నాడా... టాలీవుడ్ వర్గాలు దీనిపై చర్చ చేస్తున్నాయి. గత రెండురోజులుగా సిని వర్గాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'చెన్నై ఎక్సప్రెస్ ' లో మహేష్ ఓ చిన్న పాత్ర చేయనున్నాడని వినపడుతోంది. ఇది రూమరా లేక నిజమా అన్నది తేలాల్సి ఉంది.
ఆ వార్త ప్రకారం...మహేష్ ..సూపర్ స్టార్ గా కనపడతారు. దీపిక పదుకోని ...మహేష్ కు హార్డ్ కోర్ ఫ్యాన్. ట్రైన్ లో ఆమెకు మహేష్ కనపడతాడు. షారూఖ్,మహేష్,దీపికా ఒకరికొకరు తారసపడతారు. అక్కడ కొద్ది నిముషాలపాటు మహేష్ తన ఛార్మ్ చూపించనున్నారు. మహేష్ సినిమాకు ప్రత్యేక ఎట్రాక్షన్ అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం ఆంగూర్ రీమేక్ అని తెలుస్తోంది. కథలa షారూఖ్ ..ముంబై నుంచి రామేశ్వరం కు వెళ్లే వ్యక్తిగా కనిపించనున్నారు. రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కిది.
దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక..ఎలా చేసినా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు.


Click it and Unblock the Notifications












