ఎమ్.ఎస్ నారాయణకు మహేష్ బాబు వార్నింగ్
కమిడియన్ ఎమ్.ఎస్ నారాయణకు సూపర్ స్టార్ మహేష్ బాబు వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. దానికి కారణం..రీసెంట్ గా ఇంటర్వూలో ఎమ్.ఎస్ నారాయణ తాను దుషబాయి శీను సినిమాలో చేసిన సాల్మన్ రాజు పాత్ర మహేష్ తండ్రి కృష్ణ గారిని ఉద్దేశించి చేసానని చెప్పాడట. అది తెలుసుకున్న మహేష్ బాబు ఆయన్ని కూర్చోబెట్టి కూల్ గా..మీరు నా కన్నా పెద్ద వారు..మీకు చెప్పేటంత పెద్ద వాడిని కాదు..కానీ మీరు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి అని అన్నాడట. అన్యాపదేశంగా చెప్పినా మహేష్ విషయం అర్దం చేసుకున్న ఎమ్ ఎస్ బిక్కచచ్చిపోయి మాట్లాడకుండా అక్కడనుంచి బయిటకు వచ్చేసాడని వినపడుతోంది. ఇక మహేష్, ఎమ్ ఎస్ కాంబినేషన్ లో వర్కవుట్ చేసిన దూకుడు సీన్స్ ఇప్పటికే ధియోటర్లలలో నవ్వులు పండిస్తున్నారు. దూకుడులో మహేష్ బాబు నోటి దూల ఉన్న వాగుడుకాయగా కనపించి నవ్విస్తాడు. అలాగే పోలీస్ అధికారిగా యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను అలరిస్తన్నాయి. బ్రహ్మానందం,ఎమ్ ఎస్,మహేష్ కాంబినేషన్ లో చేసిన సీన్స్ కు రెస్పాన్స్ బాగుండటంతో దర్శకుడు శ్రీను వైట్ల చాలా హ్యాపీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











