twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు ‘దూకుడు’చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

    By Srikanya
    |

    మహేష్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'దూకుడు" చిత్రం జూన్ 16 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 'ఖలేజా" చిత్రం తర్వాత మహేష్‌ బాబు నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంతా హీరోయిన్‌ గా నటిస్తోంది. హ్యాపిడేస్ సోనియా'దూకుడు" చిత్రంలో ఓ ప్రముఖ పాత్రను పోషిస్తోంది.హ్యాపీడేస్, 'వినాయకుడు, బ్రహ్మాలోకం టు యమలోకం వయా భూలోకం"లో నటించిన సోనియాను ఇప్పుడు ఓ అరుదైన అవకాశం వరించింది.

    16 రీల్స్‌ బ్యానర్‌ పై రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. 'దూకుడు" టైటిల్‌ కు తగ్గట్టుగా ఈ చిత్రంలో 'నీ దూకుడుకు సాటెవ్వడు..." అంటూ సాగే ఓ సాంగ్‌ ని పెట్టారు. అలాగే్ ఈ చిత్రంలో మహేష్ ..పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ఈ చిత్రానికి 'కిక్", 'బృందావనం" ఫేం తమన్ సంగీతం అందిస్తున్నాడు.

    శ్రీను వైట్ల మార్కు కామెడీతో పాటు మహేష్ సినిమాల్లో వుండే హై ఓల్టేజ్ యాక్షన్ ఈ చిత్రంలో ఉంటుందని అంటున్నారు. 'దూకుడు" కథపై ఎప్పటికంటే ఎక్కువ రోజులు కష్టపడిన శ్రీను వైట్ల మహేష్ మెచ్చే రేంజ్ లో స్టోరీ అద్భుతంగా రెడీ చేశాడని చెప్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

    English summary
    Mahesh Babu’s forthcoming film ‘Dookudu’ going to release on June 16 . The team is putting in maximum efforts to release the movie on the said date.Samantha is the leading lady in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X