మహేష్ ‘దూకుడు’ టైటిల్ కి తగ్గ సినిమాయేనా...!?
నటించే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుందనే హీరోలంతా అనుకుంటారు. అలా అనుకోకపోతే ఎవరు మాత్రం ఎందుకని ఫలానా కథని ఎంచుకుంటారు? అయితే చేసే ప్రతి సినిమా తన కెరీర్ లో బెస్ట్ అయిపోతుందని మాత్రం ఏ హీరో అనుకోడు. అంతో ఇంతో జడ్జిమెంట్ అంటూ ఉంటుంది కాబట్టి దాని రేంజ్ ఏంటో ముందే తెలుసుకుని అందుకు తగ్గట్టే హైప్ చేస్తాడు. కానీ మహేష్ బాబు తను నటించే ప్రతి సినిమా తన నట జీవితంలో అత్యుత్తమ చిత్రమని ఫీలవుతాడు. పోకిరి తర్వాత మహేష్ కి ఇలాంటి భ్రమలు మరీ ఎక్కువయ్యాయి.
ఇంతవరకు తన కెరీర్ లో ఉత్తమం అని చెబితే అది పోకిరిని మించి ఉంటుందనే అర్థం వస్తుంది. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే అదేమో వీర సుత్తి అని తేలుతోంది. సైనికుడు, అతిథి, ఖలేజా అనుభవమయ్యాక కూడా మహేష్ ఇంకా ఈ స్టాండర్డ్ సుత్తి డైలాగ్ చెప్పడం విడ్డూరమే అనుకోవాలి. 'దూకుడు' సినిమా తన కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రమని డైలాగ్ చెప్పడం విడ్డూరమే అనుకోవాలి. 'దూకుడు" సినిమా తన కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రమని డైలాగ్ మహేష్ చెప్పగానే అభిమానుల గుండెల్లో రాయి పడింది. ఈసారైనా ఈ డైలాగ్ కి తగ్గ సినిమా వస్తుందో లేక మళ్లీ మరో ఫ్లాప్ చవిచూడాల్సి వస్తుందోనని ఫ్యాన్స్ కి టెన్షన్ స్టార్ట్ అయింది.


Click it and Unblock the Notifications











