మరో సినిమా కమిటైన మహేష్...డిటేల్స్
'మిర్చి' ఘాటు చూపించి హిట్ కొట్టిన కొరటాల శివ రీసెంట్ గా మహేష్‌కి ఓ కథ వినిపించారని తెలుస్తోంది. ఆ కథ ఆయనకు విపరీతంగా నచ్చడంతో... బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పారట. వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బాలీవుడ్ నిర్మాణ సంస్థ యూ టీవీ మోషన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి మహేష్ 20 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. '1' చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు', ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో 'శివమ్'చేస్తారు. ఆ తర్వాత కొరటాల శివ చిత్రం మొదలు కానుందని వినికిడి. మహేష్ స్పీడుకు ఇండస్ట్రీ షాక్ అవుతోంది.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1' (నేనొక్కడినే) చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు నిర్మాతలు. ఆశించినన్ని థియేటర్లు దొరికితే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా విడుదల చేయడానికి ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
'1' చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనమ్ హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నార్తన్ ఐర్లాండ్, లండన్, యు.కె.లో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన కీలకమైన భాగం ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












