మహేష్ బాబు అసంతృప్తి... ‘మహర్షి’ వాయిదా అందుకేనా?
Recommended Video

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహర్షి'. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25 విడుదల చేయాలని కొన్ని రోజుల క్రితమే డిసైడ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఇది ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
సినిమా ఔట్‌పుట్ మీద మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు రీ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘మహర్షి' ఆ స్థాయికి రీచ్ కావాలనేది మహేష్ బాబు ఆలోచన
మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, ఆయన కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.

‘మహర్షి'లో విభిన్నమైన పాత్రల్లో..
‘మహర్షి'లో మహేష్ బాబు స్టూడెంట్‌గా, కంపెనీ సీఈఓగా, రైతుగా ఇలా విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. లుక్ పరంగా కూడా డిఫరెంటుగా కనిపించేలా గడ్డం ఉండేలా మేకోవర్ చేశారు. అన్ని బానే ఉన్నాయి కానీ సినిమాలో కొన్ని చోట్ల భావోద్వేగాలు మిస్సయినట్లు భావిస్తున్న మహేష్ రీ షూట్ చేయాలని కోరినట్లు టాక్.

రీ షూట్ మంచిదేనా?
సినిమాను రీ షూట్ చేయడం మంచిదేనా? అంటే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నిర్మాతకు అదనపు భారం పెరుగుతుంది. అయితే సినిమా సరిగా రానపుడు రీషూట్ తప్పనిసరి, దాని వల్ల చాలా సందర్బాల్లో మేలు జరిగే అవకాశాలే ఎక్కువ అని మరికొందరి వాదన. గతంలో శ్రీమంతుడులో కొన్ని సీన్లు రీ షూట్ చేయడం వల్లే అది బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెబుతుంటారు.

నిర్మాతలు ఓకే..
మహేష్ బాబు నిర్ణయంతో నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.


Click it and Unblock the Notifications











