మహేష్ బాబు ‘మహర్షి’ లీక్ కథలో నిజమెంత? చనిపోతే సినిమా హిట్టా?
Recommended Video

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రానికి సంబంధించిన స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో రకరకాలు కథలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఏ కథ తీసుకున్న అందులో కామన్ పాయింట్ అల్లరి నరేష్ పాత్ర చనిపోవడం గమనార్హం.
అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ ఫ్రెండ్ పాత్రలో నరేష్ కనిపించబోతున్నారు. నరేష్ పోషిస్తున్న పాత్ర మరణం తర్వాత కథలో ఊహించని మలుపు తిరుగుతుందని, సినిమాలో మెయిట్ ట్విస్ట్ అదే అని టాక్.

సమాజాన్ని మార్చేందుకు
తన చిన్ననాటి స్నేహితుడిని కోల్పోయిన తర్వాత ఆ ప్రభావం మహేష్ బాబు మీద తీవ్రంగా పడుతుందని... తన జీవితాన్ని మార్చుకోవడంతో పాటు సొసైటీలో కూడా మార్పు తేవాలని డిసైడ్ అవుతారని, ఈ క్రమంలో కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది.

సెంటిమెంట్ కోసం చంపేస్తారా?
మహేష్ బాబు కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గతంలో అల్లరి నరేష్ గెస్ట్ రోల్ చేసిన నటించిన చిత్రాల్లో అతడి పాత్ర చనిపోతుంది. ఆ చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన నేపథ్యంలో సెంటిమెంట్ ప్రకారం ఈ చిత్రంలో కూడా అల్లరి నరేష్ పాత్రను చంపేస్తారనే ప్రచారం ఉంది.

వ్యవసాయం
‘మహర్షి'లో మహేష్ బాబు ఆర్గానికి ఫార్మింగ్, మైక్రో అగ్రికల్చర్ చేస్తుంటాడని, సినిమా ప్రారంభంలో బిజినెస్ మ్యాన్ పాత్రలో కనిపిస్తారని, అమెరికా వెళ్లి ధనవంతుడైన పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడని, ఇండియా తిరిగి వచ్చి కొత్త పద్దతుల్లో వ్యవసాయం చేయడంపై దృష్టిపెడతారని టాక్.

మహర్షి
‘మహర్షి' కథను దర్శకుడు వంశీ పైడిపల్లి రాశారు. దాదాపు రెండేళ్ల క్రితమే అతడు ఈ కథ సిద్ధం చేయగా సూపర్ స్టార్ బిజీగా ఉండటంతో ఆయన డేట్స్ కోసం ఇతర సినిమాలేవీ చేయకుండా వెయిట్ చేసి 2018లో సినిమా మొదలు పెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుండగా మీనాక్షి దీక్షిత్, సోనాల్ చౌహాన్, జగపతి బాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











