మహేష్ కొత్త చిత్రం టైటిల్ 'కొలంబస్'?
సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ మొత్తం ఓవరాల్ గా కొత్తదనాన్ని ప్రెజెంట్ చేయటానికి, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇప్పటివరకూ కనిపించని ఆల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించనున్నారు. ఆ లుక్ ఫ్యాన్స్ ని పూర్తిగా అలరిస్తుందని భావిస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ తన హీరోలను విభిన్నంగా చూపుతూ వస్తున్నారు. ఆర్య, ఆర్య 2లలో అల్లు అర్జున్ ని స్టైలిష్ గా చూపారు. అలాగే నాగచైతన్య ను ఇంతకు ముందు ఎవరూ చూపని విధంగా 100% లవ్ లో ప్రెజెంట్ చేసారు. ఇప్పుడు ఆయన మహేష్ ని కొత్త అవతారంలో మరింత అందంగా చూపటానికి, తన రెగ్యులర్ కెమారామెన్ రత్నవేలుతో కలిసి ప్రతీ ఫ్రేమ్ అందంగా తీర్చిదిద్దుతున్నారు.
మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కృతి సనన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టడం ఇదే తొలిసారి. ''వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. మహేష్ పాత్ర విభిన్నంగా సాగుతుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications












