Don't Miss!
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్‌కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్‌లో జస్ట్‌డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
'బ్రహ్మోత్సవం' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే...
హైదరాబాద్: సూపర్ హిట్ 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా 'బ్రహ్మోత్సవం' . పి.వి.పి. సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఊటిలో జరుగుతోంది. అందుతున్న సమచారం ప్రకారం న్యూ ఇయిర్ కానుకగా జనవరి 1న బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ''ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ జరిగాయి. ఊటీలో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తాం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్‌హిట్ తర్వాత మహేష్‌తో మళ్ళీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు. పి.వి.పి. సినిమా అధినేత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.