మహేష్,కొరటాల శివ చిత్రం టైటిల్

By Srikanya

హైదరాబాద్: మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్. అక్టోబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రం టైటిల్ గురించి రకరకాలు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ మగాడు అని ఖరారు చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బ్యాంకాక్‌లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా కొరటాల శివ ఈచిత్రాన్ని తెరకెక్కించనుండటంతో ఈ టైటిల్ పరిశీలిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.

Mahesh Babu’s next is Magaadu?

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలు. మహేష్ బాబు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. ఆగడు సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు ఆ మధ్యన జరిగిన మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేక పోయారు. అయితే ఆయన లేని లోటును భర్తీ చేసేందుకు మహేష్ భార్య నమ్రత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమే స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఆమెతో పాటు మహేష్ బాబు బావ స్వరూప్ కూడా హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X