twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా జరిగితే మహేష్ చేతిలో 50 కోట్లు పడ్డట్లే.. అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ డీల్!

    |

    Recommended Video

    Mahesh Babu's Remuneration Doubled For Director Anil Ravipudi Film??

    మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అనిల్ వినిపించిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా అనిల్ రావిపూడి చిత్రంలో మహేష్ బాబు రెమ్యునరేషన్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    <strong>'1 నేనొక్కడినే' గొప్ప కథ, దెబ్బతీసింది అదే.. నిజానికి, భ్రమకి మధ్య.. పరుచూరి!</strong>'1 నేనొక్కడినే' గొప్ప కథ, దెబ్బతీసింది అదే.. నిజానికి, భ్రమకి మధ్య.. పరుచూరి!

     చివరిదశలో మహర్షి

    చివరిదశలో మహర్షి

    వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి చిత్రం చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేష్, పూజ హెగ్డే ఈచిత్రంలో జంటగా నటిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి దర్శత్వంలో చిత్రం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    బడ్జెట్ అంచనా

    బడ్జెట్ అంచనా

    దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ అవుతుందో అంచనా వేసి నిర్మాతలకు చెప్పాడట. అనిల్ సుంకర, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు రెమ్యునరేషన్ కాకుండా ఈ చిత్రానికి 50 కోట్ల బడ్జెట్ కావాలని అనిల్ రావిపూడి అడిగాడట. మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రానికి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపి 40 కోట్ల వరకు ధర పలికినట్లు తెలుస్తోంది. దీనితో అనిల్ రావిపూడి చిత్ర శాటిలైట్, డిజిటల్, హిందీ హక్కులని 50 కోట్లకు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారట.

     మహేష్ 50 శాతం కావాలట

    మహేష్ 50 శాతం కావాలట

    అనిల్ రావిపూడి చిత్రానికి మహేష్ బాబు నిర్మాతలతో క్రేజీ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి రెమ్యునరేషన్ బదులు తనకు 50 శాతం థియేట్రికల్ హక్కులు ఇవ్వాలని మహేష్ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. భరత్ అనే నేను చిత్రానికి 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అనిల్ రావిపూడి చిత్రానికి మహేష్ డీల్ నిజమే అయితే 50 కోట్లు మహేష్ చేతిలో పడ్డట్లే. సినిమా విడుదలై విజయం సాధిస్తే లాభాల రూపంలో ఇంకా ఎక్కువ మొత్తం వస్తుంది.

     రెండింతలు

    రెండింతలు

    సాధారణంగా మహేష్ బాబు 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని ప్రచారం ఉంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం అనిల్ రావిపూడి చిత్రంతో మహేష్ బాబు రెమ్యునరేషన్ రెండింతలు కానున్నట్లు తెలుస్తోంది. 50 శాతం థియేట్రికల్ హక్కులు పొందడం అంటే నిజంగా సంచలనమే. అనిల్ రావిపూడి చిత్రంతో మహేష్ బాబు సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోలలో ఒకడిగా నిలవబోతున్నాడు.

    English summary
    Mahesh Babu's remuneration doubled for director Anil Ravipudi film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X