ఎక్కడా తగ్గని మహేష్.. త్రివిక్రమ్ సినిమా కోసం మైండ్ బ్లాకింగ్ రెమ్యునరేషన్!

త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Mahesh Babu కోసం Malayalam హీరోయిన్ | Ssmb 28 Upadate | Filmibeat Telugu
ఫామ్‌లో మహేష్ బాబు

ఫామ్‌లో మహేష్ బాబు


మహేష్ బాబు వరుస హిట్స్ కొడుతూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్పైడర్ భారీ డిజాస్టర్ అందుకున్న తరువాత ఆయన దాదాపు మూడు సినిమాలు చేయగా మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు.

సర్కారు వారి పాట

సర్కారు వారి పాట

ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది.. కానీ రాజమౌళితో సినిమా అంటే ఎప్పటికి పూర్తవుతుందో తెలియని నేపథ్యంలో ఆయన ఈ మధ్యలో త్రివిక్రమ్ తో సినిమా ఖరారు చేసుకుని అనౌన్స్ చేశారు.

అదే జోరులో త్రివిక్రమ్

అదే జోరులో త్రివిక్రమ్

దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. తాత్కాలికంగా #SSMB28 అని పేరు పెట్టబడిన ఈ సినిమా 2022 వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నటుడు ఈ ఏడాది అక్టోబర్ నాటికి 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి చేయనున్న మహేష్ ఆ వెంటనే #SSMB28 ను ప్రారంభించనున్నాడు.

ఆగష్టులో సెట్స్ మీదకు

ఆగష్టులో సెట్స్ మీదకు

ఇక ఈసినిమాకు మహేష్ మైండ్ బ్లాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. హరికా హాసిన్ క్రియేషన్స్ సంస్థ సూపర్ స్టార్‌కు ఈ సినిమా కోసం ఏకంగా 55 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రారంభమవుతుందని అంటున్నారు.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

ఇక గతంలో మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలలో అతడు సినిమా సూపర్ హిట్ గా నిలవగా ఖలేజా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కానున్న మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X