మహేశ్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. సరిలేరు క్లైమాక్స్ సీక్రెట్ రివీల్

By Manoj

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత మహేశ్ చేస్తున్న సినిమా కావడం.. దానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ దర్శకత్వం వహించడం వంటి వాటి వల్ల ఈ సినిమాపై ఆది నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు, ఇందులో మహేశ్ బాబు ఆర్మీ మేజర్‌గా కనిపిస్తుండడం కూడా ప్లస్ అయింది. అందుకే ఈ సినిమాకు మొదటి నుంచీ పాజిటివ్ స్పందనే వస్తోంది. ఈ నేపథ్యంలో 'సరిలేరు' గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

రిలీజ్‌కు ముందే రికార్డులు బద్దలు

రిలీజ్‌కు ముందే రికార్డులు బద్దలు

కొద్ది రోజుల క్రితం ‘సరిలేరు నీకెవ్వరు' టీజర్ విడుదలైంది. ఇది టాలీవుడ్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే రెండు రోజుల క్రితం ఈ సినిమాలోని మొదటి పాటను వదిలారు. దేవీ శ్రీ ప్రసాద్‌ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్‌కు కూడా మంచి స్పందనే వచ్చింది. ఈ పాట 24 గంటల్లో 9.2 మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం.

Recommended Video

#CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
తన మార్క్‌ను మిస్ చేయకుండా

తన మార్క్‌ను మిస్ చేయకుండా

ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఓ రియల్ సోల్జర్ కథను ఆధారంగా తీసుకున్నానని ఇటీవల వెల్లడించాడు. దీనికి అనుగుణంగానే సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే, ఇందులో తన మార్క్ కామెడీని కూడా చూపించాడని అంటున్నారు. అంటే ఈ సినిమా మొత్తంగా సీరియస్ అండ్ కామిక్ వేలో వెళ్లిపోతుందని సమాచారం.

సరిలేరు క్లైమాక్స్ సీక్రెట్ రివీల్

సరిలేరు క్లైమాక్స్ సీక్రెట్ రివీల్

అనిల్ రావిపూడి సినిమా అంటే ఎంతో ఫన్నీగా ఉంటుంది. చివరకు క్లైమాక్స్‌లో కూడా సరదా సన్నివేశాలు పెడతాడు. ఇప్పటికే తన చిత్రాలు అన్నింటిలో ఇదే తరహా క్లైమాక్స్ రాశాడు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు'లో కూడా అలాంటిదే ఉంటుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో మహేశ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ కూడా

మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ కూడా

క్లైమాక్స్ సరదాగా సాగిపోయినప్పటికీ.. ప్రీ క్లైమాక్స్ సీన్ మాత్రం ఇప్పటి వరకు మహేశ్ కెరీర్‌లో చూడని విధంగా సెట్ చేశాడట దర్శకుడు. ఆ సమయంలో వచ్చే ఫైట్ సీన్‌లో దాదాపు వంద మంది వరకు ఫైటర్లు ఉంటారని సమాచారం. ఈ ఫైట్ దాదాపు పదిహేను నిమిషాలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

 సరిలేరు నీకెవ్వరు.. అసలు విషయం

సరిలేరు నీకెవ్వరు.. అసలు విషయం

మహేశ్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. దీనిని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే దీనికి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా లేడీ అమితాజ్ విజయశాంతి, బండ్ల గణేష్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X