Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబు వినూత్న ప్రయోగం.. ఎలుకతో మ్యాజిక్! వెరీ వెరీ ఇంట్రెస్టింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వినూత్న ప్రయోగంతో మనందరి ముందుకు రాబోతున్నారట. ఓ ఎలుకతో మహేష్ చేసిన మ్యాజిక్ సినీ ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇవ్వనుందట. ఒకే ఒక్క ఎలుకతో ఆయన చేసిన ఈ ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏ నాటికీ మరవలేరని అంటున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఈ ప్రయోగం చేసేది ఎక్కడ? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు
ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మహేష్ బాబు. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. చిత్రంలో మహేష్ చేసే కామెడీ ఎపిసోడ్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

ట్రైన్ ఎపిసోడ్.. ఆ తర్వాత ఎలుకతో మ్యాజిక్
మొదటి నుంచి ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ కానుందని వార్తలు వింటూనే ఉన్నాం. దాదాపు అరగంటకు పైగా ఉండే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. అయితే ఈ కామెడీ ఎపిసోడ్ ప్రథమార్థంలో వస్తే.. ద్వితీయార్థంలో మరో కామెడీ ఎపిసోడ్ పెట్టారట అనిల్ రావిపూడి. ఈ కామెడీలో ఓ ఎలుక ప్రధాన పాత్ర పోషించనుందని సమాచారం.

అనిల్ ఆలోచన అదే.. అందుకే
ప్రథమార్థంలో ట్రైన్ ఎపిసోడ్‌కి ధీటుగా ద్వితీయార్థంలో ఎలుక ఎపిసోడ్ ఉంటుందట. తొలి నిమిషం కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడు ఫస్టాఫ్, సెకండాఫ్ ఒకే రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనే ఆలోచనతో సెకండాఫ్‌లో ఎలుక ఎపిసోడ్‌ను ప్లాన్ చేసి చిత్రీకరించారట అనిల్. దీంతో పాటు వెన్నెలకిషోర్, సుబ్బరాజు కామెడీ ట్రాక్ కూడా ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది.

జనాల్లో ఆతృత పెంచేస్తూ
బేసికల్‌గా అనిల్ రావిపూడి సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఉంటుంది. అలాంటిది ఇన్ని కామెడీ ఎపిసోడ్స్, అందులోనూ మరిన్ని డిఫరెంట్ యాంగిల్స్ కామెడీ అని తెలుస్తుండటంతో `సరిలేరు నీకెవ్వరు` సినిమాపై ఆతృత మరింత పెరుగుతోంది జనాల్లో.

సరిలేరు నీకెవ్వరు సెన్సార్.. రిలీజ్ డేట్
ఇక ఇటీవలే `సరిలేరు నీకెవ్వరు` సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్‌ను పొందింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించింది. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.