'సరిలేరు నీకెవ్వరు'లో అదే హైలైట్.. గతంలో ఏ సినిమాలో చూడని విధంగా!

Recommended Video

Anil Ravipudi Design's A Hilarious Track For Mahesh Babu | Sarileru Neekevvaru || Filmibeat Telugu

భరత్ అనే నేను, మహర్షి లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో సంక్రాంతి సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా కథ, కథనం విషయంలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఓ వార్త మహేష్ అభిమానుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

అనిల్ రావిపూడి స్టైల్‌లోనే

అనిల్ రావిపూడి స్టైల్‌లోనే

డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీని కొదవే ఉండదు. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేయడంలో ఆయన స్టయిలే వేరు. ఇటీవలే వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 సినిమా ద్వారా తన కామెడీ ట్రాక్ ఎలా ఉంటుందనేది పక్కాగా నిరూపించారు అనిల్ రావిపూడి. అయితే అదే తరహాలో తన రెగ్యులర్ పంథాలోనే 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా కామెడీ పండించాలని ఆయన భావిస్తున్నారట.

కాశ్మీర్ టు ఆంధ్ర.. ఫుల్ జోష్

కాశ్మీర్ టు ఆంధ్ర.. ఫుల్ జోష్

తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కామెడీ ట్రాక్‌కే పెద్ద పీట వేశారని తెలుస్తోంది. చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కాశ్మీర్ నుంచి ఆంధ్రకు వచ్చే ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేశారట. కాశ్మీర్ టు ఆంధ్ర ట్రైన్‌లో మహేష్, ఇతర నటీనటులతో హిలేరియస్ కామెడీ పండించాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట.

అదే హైలైట్.. గతంలో చూడని విధంగా!

అదే హైలైట్.. గతంలో చూడని విధంగా!

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఈ ట్రైన్ కామెడీ ట్రాకే హైలైట్‌గా నిలువనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సాధారణంగానే కామెడీ డోస్ అంటే ఇష్టపడే అనిల్ రావిపూడి.. ఈ ఎపిసోడ్ కోసం కామెడీకి మరింత డోస్ ఆడ్ చేస్తున్నారట. మహేష్ బాబును హైలైట్ చేస్తూ ఈ కామెడీ గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎలాగూ 'దూకుడు' లాంటి సినిమాల్లో కామెడీ పరంగా మహేష్ అదరగొట్టాడు కాబట్టి ఈ వార్త మహేష్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

మహేష్‌తో రష్మిక, విజయశాంతి

మహేష్‌తో రష్మిక, విజయశాంతి

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X