సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్ ఎంతో తెలుసా..? మ్యాటర్ లీక్..
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే సినిమా ప్రమోషన్స్ దిశగా అడుగులేస్తున్న చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆత్రుత పెంచేస్తోంది.
తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించిన ఆసక్తికర అప్‌డేట్ తెలిసింది. చిత్రాన్ని కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలిచిన అనిల్ రావిపూడి.. మొత్తంగా 2 గంటల 30 నిమిషాల నిడివి ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు ఆడియన్స్‌ని థ్రిల్ చేసేలా ఆయన రూపొందించిన కొన్ని సన్నివేశాలు గతంలో ఎన్నడూ చుడనివిధంగా ఉంటాయని టాక్ నడుస్తోంది.

మహేష్ బాబు కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ నుండి సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఇప్పటి వరకు టైటిల్ ట్రాక్ మాత్రమే విడుదలైంది. మిగతా లిరికల్ సాంగ్స్ త్వరలోనే విడుదల కాబోతున్నాయట. చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











