సరిలేరు నీకెవ్వరులో 'జబర్దస్త్' ఎపిసోడ్.. హవా అంతా వాళ్లదే మరి!
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. మహేష్ కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమాలో ఓ కామెడీ సీక్వెన్స్ గురించిన ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఆ వివరాలు చూద్దామా..

షూటింగ్ ప్రారంభానికి ముందు నుంచే..
రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా కథ, కథనం విషయంలో రకరకాల వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నడుమనే సినిమాకు భారీ ప్రమోషన్ కూడా దక్కింది. అలా అలా సినిమా షూటింగ్ అంతా ఫినిష్ చేశారు మేకర్స్. డిసెంబర్ 18న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.

మహేష్ బాబుతో అనిల్ రావిపూడి మ్యాజిక్
కామెడీ పండించడంలో తనదైన స్టైల్ చూపించే డైరెక్టర్ అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' హిలేరియస్ కామెడీ ఎపిసోడ్ పెట్టారని తెలుస్తోంది. ఇటీవలే వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ఎఫ్ 2 సినిమా ద్వారా తన కామెడీ ట్రాక్ ఎలా ఉంటుందనేది పక్కాగా నిరూపించిన ఆయన ఈ సారి మహేష్ బాబు, బండ్ల గణేష్ సహా జబర్దస్త్ కమెడియన్లతో మ్యాజిక్ చేశారట.

ఏకంగా 39 నిమషాల పాటు.. సినిమాకే హైలైట్
అనిల్ రావిపూడి పంథాలోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కామెడీ సీక్వెన్సులు అదిరిపోతాయని, ప్రేక్షకుల కడుపులు చెక్కలైపోయేలా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ రూపొందించారని టాక్ బయటకొచ్చింది. ఏకంగా 39 నిమషాల పాటు ఉండే ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు.

ట్రైన్ జర్నీలోనే హీరోయిన్ ఫ్యామిలీ అంతా
మహేష్ బాబును హైలైట్ చేస్తూ ఈ కామెడీ గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఉంటుందని సమాచారం. ఈ ట్రైన్ జర్నీలోనే హీరోయిన్ ఫ్యామిలీ అంతా కలిసి హీరోను పడేయడం, హీరోయిన్ రష్మికను మహేష్ బాబుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఫిక్స్ కావడం లాంటి సన్నివేశాలు ఉంటాయట.

జబర్దస్త్ ఎపిసోడ్.. ఆ ఇద్దరూ
ఇక ఈ 39 నిమిషాల ఎపిసోడ్‌లో జబర్దస్త్ కమెడియన్స్ చమ్మక్ చంద్ర, అప్పారావు మధ్య వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లను నవ్వులతో హోరెత్తించడం ఖాయం అని టాక్. ఇక చాలాకాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మరో కమెడియన్ బండ్ల గణేష్ కామెడీ కూడా అబ్బురపరుస్తుందని తెలుస్తోంది.

రసిక ప్రియులకు చిరకాల గుర్తింపు
ఇక తమన్నా ఐటెం సాంగ్ రసిక ప్రియులకు చిరకాల గుర్తింపు అయ్యేలా ఉంటుందట. అలాగే విజయశాంతి రోల్ సినిమాకు ప్లస్ అవుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి జనవరి 11 నుంచి 'సరిలేరు నీకెవ్వరు' హంగామా ఎలా ఉంటుందనేది.


Click it and Unblock the Notifications











