సరిలేరు నీకెవ్వరు సర్‌ప్రైజ్: ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో రాబోతున్న మరో భారీ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ సినిమా అప్‌డేట్స్ ద్వారా నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్నారు మహేష్ బాబు. ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అయింది. మరో వారం రోజుల్లో షూటింగ్ అంతా ఫినిష్ కానుంది. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు వివరాలు తెలుపుతూ మహేష్ అభిమానుల్లో జోష్ నింపుతోంది చిత్రయూనిట్.
ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ వేగవంతం చేశారు సరిలేరు నీకెవ్వరు యూనిట్ సభ్యులు. ఈ మేరకు ప్రతీ సోమవారం ఓ సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కి సంబంధించిన అప్‌డేట్ తెలిసింది. ఈ ట్రైలర్‌ని డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. క్లాస్, మాస్ అన్నివర్గాల ప్రేక్షకులకు కిక్కిచ్చేలా ఈ ట్రైలర్ కట్ చేస్తున్నారట.

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రారంభం నుంచే ఆసక్తిరేపే అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు యూనిట్ సభ్యులు. ఎప్పటికప్పుడు మహేష్ ఫ్రెష్ లుక్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఈ సంక్రాంతికి మహేష్ హంగామా ఫుల్లుగా ఉంటుందని ఫిక్సయి పోయారు ప్రేక్షకులు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందుతోంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











