Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ టైటిల్ 'శ్రీమంతుడు' కాదట... మరి
హైదరాబాద్ : మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టైటిల్ కాకుండా 'జమీందారు' అనే టైటిల్ ని పరిశీలుస్తున్నట్లు సమాచారం. గతంలో అంటే 1965 లో వచ్చిన టైటిల్ ఇది...అప్పట్లో హిట్ అయ్యింది. ఆ చిత్రంలో అక్కినేని, కృష్ణ కుమారి, సావిత్రి కలిపి నటించారు. ఇప్పుడు అదే టైటిల్ ని అనుకుంటున్నారు. అయితే నాని తో ఈ మధ్యనే 'పిల్ల జమీందారు' టైటిల్ తో చిత్రం చేసారు అనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 'జమీందారు' టైటిల్ పెడతారా లేదా అనేది కొందరికి కలుగుతున్న సందేహం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రుతిహాసన్ లు జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా యూనిట్ పోలాచ్చి నుంచి తిరిగి వచ్చిన తరువాత సన్నీలియోన్ తో ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన సెట్ ను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈసారి సన్నీతో మహేష్ స్టెప్స్ వేస్తే ఈ సినిమాకు బయ్యర్లలో మరింత క్రేజ్ పెరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారు అని చెప్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 17 న మహా శివరాత్రి పూట విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే ఆ రోజు అభిమానుల ఆనందం ఏ రేంజిలో ఉంటుంమదో ఊహించండి. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిర్మాత,దర్శకుడు ఇప్పటివరకూ ఏ టైటిలూ ప్రకటించలేదు.
శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.
అయితే తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.
మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.