వద్దు...బాబోయ్ అంటున్నాడట మహేష్
హైదరాబాద్: 'ఆగడు' ఫెయిల్యూర్ ప్రబావం మహేష్ బాబు పై బాగనే పడిందంటున్నారు. పంచ్ డైలాగులు అంటేనే వద్దని చెప్పుతున్నాడని సమాచరం. కొరటాల శివకు ఈ విషయమై సీరియస్ గా చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎక్కడన్నా తప్పితే 60 సీన్స్ లోనూ పంచ్ డైలాగులతో నింపవద్దని, అలాగే పూర్తి కామెడీ చెయ్యవద్దని, సినిమాలో ఒక భాగంగానే కామెడీని పెట్టాలని ఆదేశించినట్లు సమాచరం. ఈ మేరకు కొరటాల శివ స్క్రిప్టులో సర్దుబాట్లు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
గతంలో మిర్చి, రన్ రాజా రన్ చిత్రాలకు కెమెరా వర్క్ ఇచ్చి సినిమాకు బాగా ప్లస్ అయిన మది..తన తాజా చిత్రం నిమిత్తం కోటి నలభై లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఈ పెద్ద మొత్తం అందిందని ఫిల్మ్ నగర్ టాక్.
మహేష్‌బాబు - కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటుందని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా బండి ముందుకు కదిలింది. కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తామని చిత్రబృందం ప్రకటించింది.

మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్, మాస్ కలిపిన కథలో మహేష్ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.
నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్.


Click it and Unblock the Notifications











