‘మా’ లొల్లి: తన నిర్ణయంతో షాకిచ్చిన మహేష్ బాబు!
Recommended Video

'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా త్వరలో మహేష్ బాబుతో ఓ కార్యక్రమం జరుగాల్సి ఉంది. అయితే నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో మహేష్ బాబు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. 'మా' తో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసలే వివాదాల్లో ఉన్న 'మా'పై మహేష్ బాబు నిర్ణయంతో పిడుగుపడ్డట్లయింది. అదే నిజమైతే దాదాపు రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు నష్టం తప్పదని అంటున్నారు విశ్లేషకులు.

సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్ లాంటి స్టార్లతో ఈవెంట్స్ నిర్వహించి భారీగా నిధులు సేకరించి ‘మా'కు సొంత బిల్డింగ్ నిర్మించడంతో పాటు సేవాకార్యక్రమాలు చేయాలనేది ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

చిరంజీవితో యూఎస్ఏలో
ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం అమెరికాలో చిరంజీవితో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. దీని ద్వారా రూ. 1 కోటి ఫండ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం ద్వారా అనుకున్నంత ఫండ్ రాలేదని, దీనికి కారణం.... ‘మా'లోని కొందరు వ్యక్తులే అని అంటున్నారు. వారి వల్లే నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

శివాజీ రాజా వర్సెస్ నరేష్
ఈ పరిణామాల నేపథ్యంలో ‘మా' ప్రెసిడెంట్ శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ మధ్య వివాదం రాజుకుంది. ఇద్దరూ వేర్వేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు వచ్చినపుడు క్లారిటీ ఇవ్వాలని నరేష్ వాదిస్తుంటే.... ‘మా' ప్రెసిడెంట్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే నరేష్ ఈ గొడవ చేస్తున్నాడంటూ శివాజీ రాజా మండి పడ్డారు.

తనకు అనుమానం వచ్చిందన్న నరేష్
ఇటీవల ప్రెస్ మీట్లో నరేష్ మాట్లాడుతూ... మహేష్ బాబును ప్రోగ్రాం చేయడానికి ఒప్పించాను. దానికి కూడా కోటి రూపాయలు అన్నపుడు కొంచెం అనుమానం, కన్ ఫ్యూజన్ కలిగిందని తెలిపారు. ఈ ప్రోగ్రాం నా ఆధ్వర్యంలో జరుగాలని నమ్రత కోరారు. ఈ విషయం చెప్పినా పట్టించుకోకుండా ఇంచార్జిగా బెనర్జీని నియమించారని తెలిపారు.

వారిపై నమ్మకం లేకనే నమ్రత ఇలా?
చిరంజీవితో నిర్వహించిన షో సక్సెస్‌ఫుల్‌గా చేయలేకపోవడం, ఆశించిన స్థాయిలో నిధులు రాక పోవడం వల్లనే... మహేష్ బాబుతో చేయబోయే షో నరేష్ ఆధ్వర్యంలో జరుగాలని నమ్రత ఆశించారట. ఆ తర్వాత నిధుల దుర్వినయోగం తెరపైకి రావడంతో ‘మా'తో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని మహేష్ బాబు డిసైడైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











