మహేష్ బాబుతో ఇబ్బంది పడుతోన్న హీరోయిన్....!?
మహేష్ బాబు యమహొ అంటూ అతని మీద ప్రశంసల వర్షం కురిపించేసిన సమంతకి ఇప్పుడు మహేష్ 'దూకుడు" తో ఇబ్బందిగా ఉందట. మొదటి రెండు సినిమాల్లో పొట్టి హీరోలైన నాగచైతన్య, ఎన్టీఆర్ తో నటించడం వల్ల హైట్ పరింగా ఎలాంటి సమస్యలు ఎదురుకాని సమంతకి ఆరడుగులకి మించి బారున్న మహేష్ బాబు సరసన నటించడమంటే చచ్చేంత తలనొప్పి అయిందట. అయిదడుగుల మూడంగుళాల హైటున్న సమంత మహేష్ పక్కన నిలబడితే అతని భుజాల కంటే కిందకే వస్తోందని అతనితో కలిసి నిలబడాల్సిన, నడవాల్సిన సీన్లలో సమంత ఆరంగుళాల హీల్స్ వాడుతోందట.
మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందపడాలో, ఈ హైట్ ప్రాబ్లెమ్స్ తో ఎక్స్ట ట్రా నొప్పులు పడాల్సి వస్తున్నందుకు బాధ పడాలో సమంతకి అర్థం కావడం లేదట. అయితే తెలుగు ఇండస్ట్రీలో అయితే పొడుగోళ్లు, లేదంటే పొట్టోళ్లే ఉండడంతో అటు, ఇటయినా సరే అడ్జస్ట్ అయిపోవాల్సి ఉంటుంది కాబట్టి సమంత కూడా తన సీనియర్ హీరోయిన్లనే ఫాలో అయిపోతూ నెమ్మదిగా దీనికి అలవాటు పడుతోందట. పొట్టి హీరోలతో నటించడానికి ఇబ్బంది పడతామని అనుష్క, కాజల్ తరచూ చెబుతుండడం వినే ఉంటారుగా..


Click it and Unblock the Notifications











