'సర్కారు వారి పాట' మళ్ళీ మొదటికొచ్చింది.. మరింత ఆలస్యం?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో కమర్షియల్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని వంశీ పైడిపల్లితోనే మరో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బకు ప్లాన్ మొత్తం మారిపోయింది. ఎందుకో మహర్షి దర్శకుడిని పక్కన పెట్టిన మహేష్ సర్కారు వారి పాటను లైన్ లోకి తెచ్చాడు.

పరశురామ్ కథను చెప్పిన విధానం మహేష్ కి అమితంగా నచ్చింది. పైగా గీత గోవిందంతో హిట్టు కొట్టిన దర్శకుడని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేద్దాం అంటే ఎన్ని ప్లాన్స్ వేసిన వర్కౌట్ కావడం లేదు. బడా ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వారి బ్యాడ్ లక్ ఏమిటో గాని సర్కారు వారి పాట విషయంలో మొదటి నుంచి కూడా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనా ఇదే నెలలో యూఎస్ లో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

Mahesh babu Sarkaaru vaari pata upcoming schedule dates changed

దర్శకుడు పరశురామ్ అలాగే మరికొందరు లొకేషన్స్ ఫైనల్ చేయడానికి వెళ్లగా ఇప్పుడు సడన్ గా ఆ షెడ్యూల్ కి బ్రేక్ వేసినట్లు టాక్ వస్తోంది. ఇక షూటింగ్ ని జనవరికి షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫ్రెష్ షెడ్యూల్ తో షూటింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. మొన్నటివకు ఆర్టిస్టుల నుంచి తీసుకున్న కాల్షీట్స్ ని కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి మరింత ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. సమ్మర్ అనంతరం రిలీజ్ ఉంటుందని టాక్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు షూటింగ్ మరోసారి వాయిదా పడుతుండడంతో సినిమా ఇయర్ ఏండింగ్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు స్సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X