మహేష్ అభిమానుల్లో కన్ఫ్యూజన్.. ఆ రూమర్స్ పై క్లారిటీ ఇవ్వరా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గీత గోవిందం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాల డోస్ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. చిత్ర యూనిట్ ఆ రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.

దీంతో ఆడియెన్స్ లో కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సర్కారు వారి పాటలో హీరోయిన్ ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మహానటి కీర్తి సురేష్ దాదాపు ఫిక్స్ అన్నట్లు టాక్ వస్తోంది. కానీ మరోవైపు ఆమె సన్నబడటం వలన మళ్ళీ రిజెక్ట్ చేశారని కామెంట్స్ వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ త్వరలో విదేశాల్లో ఒక షెడ్యూల్ కోసం ప్లాన్ రెడీ చేసుకుంటోంది.

Mahesh babu sarkaaru vari paata rumours viral on social media

అందుకోసం కీర్తి సురేష్ వీసా, వర్క్ పర్మిట్ కోసం చిత్ర యూనిట్ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అంటే కీర్తి మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు మళ్ళీ కథనాలు వెలువడుతున్నాయి. మరొక హీరోయిన్ పాత్ర కోసం కూడా దర్శకుడు కొంతమంది యువ హీరోయిన్స్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. ఇక హీరోయిన్స్ విషయం పక్కనపెడితే సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ విషయాలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X