సర్కారు వారి పాట.. దుబాయ్ యాక్షన్ సీన్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ ఒక డిఫరెంట్ స్టైల్ తో దర్శనమివ్వనున్నాడు. బ్యాంకు మోసాలు నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు భారీగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దుబాయ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్ గా ఉంటాయట. ఆ వివరాల్లోకి వెళితే...

గత ఏడాదిలోనే..
గీత గోవిందం సక్సెస్ అనంతరం దర్శకుడు పరశురామ్ ఎంతో నమ్మకంగా మొదలుపెట్టిన సర్కారు వారి పాట సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ స్టైల్ తో కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.

మహేష్ - కీర్తి మధ్యలో..
మహేష్ బాబు చాలా కాలం తర్వాత తన హెయిర్ స్టైల్ ను కూడా ఈ సినిమా కోసం పూర్తి గా మార్చేశాడు. సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ప్రతి ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. ఆమె ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్యలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా నవ్విస్తూనే మంచి ఫీల్ ను కలిగిస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా
అయితే సర్కరు వారి పాట సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దుబాయి లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఉంటుందట. సినిమా సెకండాఫ్ లో వచ్చే ఆ సన్నివేశాకు ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉంటాయని తెలుస్తోంది.

పెరిగిన బడ్జెట్..
ఇక సర్కారు వారి పాట కోసం మొదట అనుకున్న బడ్జెట్ కంటే కూడా చాలా వరకు పెరిగిపోయిందట. ఎందుకంటే కోవిడ్ కారణంగా షెడ్యూల్స్ తారుమరవ్వడమే కాకుండా నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయడంలో కూడా చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా సినిమా 75 కోట్లతో ఫినిష్ చేయాలి అనుకుంటే బడ్జెట్ 90 కోట్ల వరకు పెరిగినట్లు సమాచారం.
Recommended Video

ఆ సీన్స్ కోసమే భారీగా..
ఇక దుబాయ్ లో చేసింగ్ సీన్స్ యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. సినిమాలో కీలకమైన ఎపిసోడ్ కావడంతో నిర్మాతలు ఖర్చు చేయడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది. మహేష్ బాబు చేసే విన్యాసాలు కూడా ఈ యాక్షన్ ఎపిసోడ్ లో విజిల్స్ వేసేలా ఉంటాయని టాక్ వస్తోంది. మరి ఫైనల్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











