twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sarkaru Vaari Paata నుంచి మరో లీక్.. మహేష్ బిజినెస్ పేరేంటో తెలుసా?

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా బిగ్ బడ్జెట్ మూవీ సర్కార్ వారి పాట ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ చాలా బిజీగా ఉంది ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను కూడా చెబుతున్నారు. సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు కూడా మహేష్ బాబు అని ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

    అసలు మొదట ఇలా ఒరిజినల్ పేరు పెడితే వర్కౌట్ అవుతుందా అని మహేష్ దర్శకుడితో కాస్త అనుమానాన్ని వ్యక్తం చేశాడట. తప్పకుండా వర్కౌట్ అవుతుంది అని చెప్పడంతో మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక షూటింగ్ జరిగే క్రమంలో నేను మహేష్ బాబు అని చెప్పే డైలాగ్స్ చాలా సరదాగా అనిపించాయని సినిమాలో ఆడియన్స్ అలాంటి డైలాగ్స్ విన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు తెలియజేశాడు.

    Mahesh babu sarkaru Vaari Paata another leak point

    ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలకు థియేటర్స్ దద్దరిల్లి పోవడం ఖాయమని అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాలోని సన్నివేశాలను ఎంజాయ్ చేస్తారు అని కూడా దర్శకుడు వివరణ ఇచ్చాడు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం గురించి కూడా తెలిసింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక లోన్ రికవరీ ఏజెంట్ గా కనిపిస్తాడు అని మొదట టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా లో మహేష్ బాబు ఫైనాన్స్ కంపెనీ పేరుతో సంస్థ కొనసాగిస్తూ ఉంటాడు అని టాక్ వస్తోంది. ప్రస్తుతం MFC పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

    ఇక సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ అయితే చాలా కొత్తగా ఉంటుంది అని ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మహేష్ బాబు మాత్రం పోకిరి సినిమా తర్వాత మళ్లీ అంతకంటే ఎక్కువ స్థాయిలో తన క్యారెక్టర్ ను ఎంజాయ్ చేస్తారు అని చెబుతున్నాడు. ఇక ఈ సినిమా చివర్లో వచ్చే ఒక మంచి ఎమోషనల్ సీన్ కూడా ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుందట. ఒక బాధ్యత గురించి వివరణ ఇచ్చే విధానం కూడా ఆలోచింపజేస్తుంది అని చెబుతున్నారు. ఇక కీర్తి సురేష్ పాత్ర కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా సరదాగా ఉంటుందట. ఆ తరువాత సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆమె క్యారెక్టర్ చుట్టూ తిరిగుతాయని.. ఆమె కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని తెలుస్తోంది.

    ఇక సర్కారు వారి పాట సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా హైదరాబాద్ లో సినిమా మూడు కోట్లకు పైగా అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 120 కోట్లకు పైగా టార్గెట్ తో మార్కెట్లోకి రాబోతోంది. మరి మొదటిరోజు సర్కారు వారి పాట ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Mahesh babu sarkaru Vaari Paata another leak point
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X