Sarkaru Vaari Paata: రాజమౌళి కంటే ముందే పాన్ మహేష్ పాన్ ఇండియా ప్లానింగ్.. ఎందుకంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా ఓ వర్గం ప్రేక్షకులు మహేష్ కోసం సినిమాల ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక డైరెక్ట్ గా తెలుగు లో రిలీజ్ కావాల్సిన సర్కారు వారి పాట సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఇంత హఠాత్తుగా చిత్ర యూనిట్ సభ్యులు ఎందుకు పాన్ ఇండియా నిర్ణయం తీసుకుంటున్నారు అనే అనే వివరాల్లోకి వెళితే..

మహేష్ పాన్ ఇండియా..

మహేష్ పాన్ ఇండియా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో గతంలో ఎప్పుడూ లేనంతగా అగ్రహీరోలు అందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఒక్కసారి అటువైపు అడుగులు వేసిన హీరోలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. మన దర్శకులు కూడా హీరోల తగ్గట్టుగానే ఆలోచిస్తున్నారు. మహేష్ బాబు కూడా త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు.

కొనసాగుతున్న చర్చలు

కొనసాగుతున్న చర్చలు

అయితే రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ బాబు మరొక సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఇప్పటికే తమిళంలో విడుదల చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. హిందీలో కూడా విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దర్శకుడితో ఇటీవల చర్చలు జరిపింది.

ఆ భాషల్లో మహేష్ పట్టు

ఆ భాషల్లో మహేష్ పట్టు

మహేష్ బాబుకు కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి మార్కెట్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైరెక్ట్ తెలుగు సినిమాలే అక్కడ ఒక రేంజిలో కలెక్షన్స్ అందుకుంటాయి. ఇక కన్నడలో విడుదల చేస్తే అంతకుమించి కలెక్షన్స్ వస్తాయి. ఇక తమిళనాడులో కూడా మహేష్ కు క్రేజ్ ఉంది. మలయాళం లో కూడా సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయాలని అందుకోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా నిర్వహించాలి అని అనుకుంటున్నారు.

ఆ కారణంగా..

ఆ కారణంగా..

వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి రెగ్యులర్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ తరువాత మహేష్ తో రాజమౌళి సినిమా చేస్తాడు కాబట్టి ఆ సినిమా తెరపైకి రాక ముందే భారీ స్థాయిలో హైప్ ఐతే క్రియేట్ అవుతుంది. ఈ విషయంపై నిర్మాతలు ముందుగానే ఆలోచించి సర్కారు వారి పాట సినిమాకు RRR ద్వారా రాజమౌళి కి వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకోవాలని చూస్తారు.

Recommended Video

Tollywood Meets CM YS Jagan, 20 శాతం షూటింగ్ AP లోనే..!| Filmibeat Telugu
భారీగా ప్రమోషన్స్ చేసి..

భారీగా ప్రమోషన్స్ చేసి..

మహేష్ బాబు తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయగా యూట్యూబ్లో కూడా రికార్డు స్థాయిలో వ్యూవ్స్ ఐతే ఆ అందుకుంటాయి. కొన్నిసార్లు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చినప్పటికీ మహేష్ వాటిని చేయడానికి ఒప్పుకోలేదు. కానీ పాన్ ఇండియా సినిమా చేయడానికి మాత్రం రెడీగా ఉన్నాడు. ఇక సర్కారు వారి పాట సినిమాకు ప్రమోషన్స్ చేసి భారీగా విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X